News and Entertainment

ఏనుగు పేడతో కాఫీ..టేస్ట్ అదుర్స్-ఫుల్ డిమాండ్




థాయ్‌లాండ్ లోని రెస్టారెంట్లు, హోటళ్లు, కాఫీ హౌస్ లు వివిధ రుచులతో పర్యాటకులను ఆకర్షించడంలో పోటీ పడుతుంటాయి. ఈ పోటీని దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తి అధ్బుతమైన ఆలోచన చేసాడు. అతని ఆలోచన విజయవంతమైంది. అతను అనుకున్నదాని కంటే వ్యాపారం రెండింతలు అయ్యింది. ‘బ్లేక్ డిన్ కిన్ అనే’ థాయిలాండ్ వాసి బ్లాక్ ఐవరి కాఫీని కనిపెట్టాడు. భారత కరెన్సీ ప్రకారం ఆ ఒక్క కాఫీ విలువ రూ.850. అతను ఆ కాఫీని తయరు చేసే విధానం చెప్తే వినడానికి విడ్డురంగా వున్నా ఇది నిజం అని నిరూపించడానికి మన కళ్ళముందే దానిని తయారు చేసి చూపిస్తున్నారు.



అతను వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొదట ఒక ఏనుగుకు 35 కిలోల కాఫీ గింజలు తినిపిస్తారు. ఏనుగు కాఫీ గింజలను జీర్ణం చేసుకున్న తరువాత పేడ వేస్తుంది. ఆ పేడలో ఒక కిలో కాఫీ గింజలు బయటపడుతాయి. ఆ గింజలను సేకరించి శుభ్రంగా కడిగి ఎండపెడతారు. తరువాత 19వ శతాబ్దానికి చెందిని ఫ్రెంచ్ కాఫీ మిషన్ లో గింజలు వేస్తారు.



ఎవరైనా ఐవరి కాఫీ ఆర్డర్ చేస్తే… ఆ మిషన్ తీసుకు వచ్చి పర్యాటకుల టేబుల్ మీదనే వేడివేడి కాఫీ తయారు చేసి ఇస్తారు. ఈ కాఫీ వగరు రుచితో ఉంటుంది. థాయ్‌లాండ్ లో పర్యాటకులను ఈ బ్లాక్ ఐవరి కాఫీ విపరీతంగా ఆకట్టుకునింది. ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం ఈ కాఫీ థాయ్‌లాండ్ తో పాటు, సింగపూర్, హాంకాంగ్ లో అందుబాటులో ఉంది. ఈ ప్రయోగాన్ని మొదట చిన్న పిల్లలు, సింహాలకు కాఫీ గింజలు తినిపించి గింజలు సేకరించానని, అయితే అది సక్సస్ కాలేదని వివరించాడు. ఏనుగుల పేడతో నా ప్రయోగం విజయవంతం అయ్యిందని బ్లేక్ డిన్ కిన్ చెప్పుకొస్తున్నాడు!