News and Entertainment

FACEBOOK అంటే శనీశ్వరుడే

ఫేస్ బుక్, వాట్సాప్, ఇంటర్నెట్ .... శని, రాహువు, జ్యోతిషం - 1

ఇవాళ ఒక బ్లాగ్ చదివాను. దాని శీర్షిక - FACEBOOK అంటే శనీశ్వరుడే. ఆ వ్యాసంలోనే ఇంటర్నెట్ ప్రస్తావన ఉంది. INTERNET కూడా శనీశ్వరుని ఆయుధమే అంటారు రచయిత. ఈ రెండవదానిపైన రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుందని రచయిత ప్రతిపాదన. ఈ కోవలోని మరియొక ఆయుధం WHATSAPP. ఇవన్నీ 8 అక్షరాల పదాలే. వీటికి శనికి గల సంబంధం ఆయన చెప్పారు. నాకు తట్టిన మరొక 8 అక్షరాల పదం COMPUTER. ఆయన చెప్పలేదుకాని నాకు సంబంధం ఉన్నది. కంప్యూటర్ల గురించి కాలేజీలలో చదువుకోలేదు కాని కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేశాను. 


మొదటితరం ఆచార్యులందరు ఎలెక్ట్రికల్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ , గణితం విద్యార్థులు, ఆచార్యులే. పైన చెప్పిన 3 అవిష్కరణల కర్తల జాతకాలలో శని రాహువుల బలాన్ని చూపించారు బ్లాగ్ రచయిత. నాకు జ్యోతిషమంటే వేదాంగముగా అపారమైన గౌరవం. కాని నాకు ఆ శాస్త్రముతో పరిచయం లేదు. నా జాతకంలో నాకు తెలిసినది రాహు దశలో జననం, శని దశలో కంప్యూటర్ సైన్స్ అధ్యయనం, అధ్యాపనం ఉన్నాయని మాత్రమే. ఏవరీ శని? మన జీవితాలకు ఆయన ఉద్యోగానికీ సంబంధం ఏమిటి? సూర్య పుత్రుడు,ఛాయా పుత్రుడు, శనైశ్చరుడు. పెద్దలు చెప్పిన శని తత్త్వం తెలుసుకుందాము.

                                                                    Next>>