News and Entertainment

లక్ష్మి ఎందుకు అలుగుతుంది ?


లక్ష్మి ధనానికి అధిష్టాన దేవత. ఇంతకీ ఆమె ఎందుకు అలుగుతుంది ? అలా అలగకుండా మనమేదైనా ఉపాయాలు చెయ్యగలమా ? అన్న ప్రశ్నకి తంత్రం సమాధానం ఇచ్చింది. వాటిలో కొన్ని నాకు తెలిసినవి పాఠకుల కోసం ఇస్తున్నాను.


మంగళ వారం నాడు అప్పు తీసుకోకూడదు, అలా చేస్తే లక్ష్మి అలగడమే కాక అప్పును స్థాయీ రూపంలో నిలిపివేస్తుంది..


బుధవారం నాడు అప్పు ఇవ్వకూడదు. అలా మాటిమాటికీ చేస్తే లక్ష్మి అలగడమే కాక ఆ ఇంటి నుండి వెళ్లిపోతుంది.


తామర పువ్వులు , బిల్వ పత్రాలు నలప కూడదు. అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.




ఈశాన్య కోణంలో వంట ఇంటిని గాని శౌచాలయాన్నిగాని కట్ట కూడదు. అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.


పూజా గృహంలో ఎంగిలి, ఆశౌచము ఉంచ కూడదు, అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.


నగ్నంగా స్నానం చేయకూడదు, సరస్సులలో, నదులలో మల మూత్ర విసర్జన చేయ కూడదు. అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.


భూముల మీద, గోడల మీద అనావశ్యకంగా వాయ కూడదు, బూతు గాని , చెడు గాని అసలు వ్రాయ కూడదు, అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.

పాదాన్ని పాదంతో రుద్ది కడగ కూడదు, చేతితోనే రుద్ది కడుగుకోవాలి. అతిథికి మర్యాద లోపం చేయ కూడదు. పశు పక్షుల గ్రాసాన్ని కాజేయ కూడదు, గోవుని అనావశ్యకంగా కొట్ట కూడదు, అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది....NextPage