News and Entertainment

లక్ష్మీదేవి అనుగ్రహానికి ఇలా చేయండి


శుక్రవారం అంటే.. అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అందులోనూ లక్ష్మీదేవికి ప్రతిరూపం శుక్రవారం. కాబట్టి ఇంట్లో అమ్మవారికి రకరకాల పూలతో అలంకరించి, నైవేద్యం సమర్పించి పూజలు చేయడం వల్ల ఆ తల్లి ఆశీస్సు పొందవచ్చు. 


అలాగే శుక్రవారం మహిళలు ఎరుపు లేదా ఆకుపచ్చ వంటి రంగుల దుస్తులు ధరించి, కాళ్లూ, చేతులు, ముఖానికి పసుపు రాసుకుని లక్ష్మీదేవిని పూజిస్తే.. ఆ తల్లి కరుణా కటాక్షాలు ఉంటాయి. అలాగే ఆ ఇంటి సిరిసంపదలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

ప్రతి ఇంట్లోనూ సిరిసంపదలు లక్ష్మీకటాక్షంతోనే పొందగలుగుతాం. ఆ తల్లి అనుగ్రహం ఉన్నంతవరకు ఇంట్లో లేమి అన్న సమస్య ఉండదు. కొంతమంది ఇబ్బందులు, సమస్యలు, డబ్బులు నిలబడకపోవడం, ఖర్చులు, అప్పుల బాధలు, రకరకాల సంపద సమస్యలు ఎదుర్కొటు ఉంటారు. 


కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం పొందడానికి లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఉండాలి. అంతేకాదు మీ రాశిని బట్టి లక్ష్మీదేవిని పూజించే మంత్రాలు ఉన్నాయి. మహా లక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించడానికి ఏ రాశి వాళ్లు ఏ మంత్రం జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం..                               Next>>