News and Entertainment

మహా మహుడు మనువు


భారత దేశానికి ‘’ధర్మ శాస్త్రాన్ని ‘’అందించిన మహాను భావుడు మనువు .అందుకే ఆయన పేరు మీదుగా ‘’మను స్మ్రుతి ‘’పేర చెలామణి అయింది .2694.శ్లోకాలలతో పన్నెండు అద్యాయాలతో ఇది ఉంది .అత్యున్నత ఆలోచనా ధోరణికి ప్రతీక గా నిలుస్తుంది .కాని కాలం లో వచ్చిన మార్పుల వల్ల అది ‘’బ్రాహ్మణులు బ్రాహ్మణులకోసం ‘’రాసుకోన్నదని,స్త్రీ కి చాలా అన్యాయం చేసిందనే పెడ వాదాలు వచ్చినా అదే ఇప్పటికి సర్వోత్క్రుస్టం అని ప్రపంచమంతా భావించి గౌరవిస్తోంది .ఒక నాటి పంజాబ్ హర్యానా ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఏం.రామజొయ్స్ మనుస్మృతి పై ఒక సాధికార గ్రంధం రాశాడు .భారత రాజ్యంగ స్పూర్తికి అనుకూలం గా ఉన్న అనేక అంశాలను ఆయన ఇందులో ఉన్నాయని వివరించాడు. మత విషయాలున్నా అవి పెద్దగా అవరోదాలుకావన్న వారే అనేకులు .సంస్కృత మను స్మృతిని 1913 1920 లలో పి హెచ్ పాండ్య ,జి ఆర్ ఘర్పూరే లు ఎడిట్ చేశారు తర్వాత దీన్ని ఇంగ్లీష్ లోకి 1974లో అనువదించిన వాడు సర్ విలియం జోన్స్ ,


స్మృతులు అంటే భిన్న కాలాలకు చెందిన సామాజిక ,రాజ కీయ రాజ్యామ్గాలని అర్ధం .శాత వాహనులకాలం నాటి నాణాలు ఈ రోజు చెల్లు బడికావు .కానీ వాటిని కరగింఛి ఉపయోగించుకో వచ్చు . అమ్ముకుంటే వాటి విలువా ఎక్కువే .ఇలానే మను స్మ్రుతి అనేక శతాబ్దాల పాటు అమలు అయింది ఇది తిరుగు లేని సత్యం .’’మనువు ‘’శబ్దం నుంచి మనిషి వచ్చింది మనిషి మనీషిగా ఉన్నతం అవటానికి కావలసిన సకల విషయాలు ఉన్న శాస్త్రం మను స్మ్రుతి .


అందరు అనుకొంటున్నట్లు మనువు బ్రాహ్మణుడు కానే కాదు .ఋగ్వేదం లో ‘’మనుర్భవః ‘’అనే మాట ఉంది .అంటే ‘’ముందుగా మనిషిగా రూపొందు ‘’అని అర్ధం .’’సర్వ జీవ రాశిని కాపాడటానికి ఉపయోగ పడే విధం గా ,ధర్మ స్వరూపం గా ఉంచేందుకు బ్రహ్మ తేజస్సు కల వాడినిగా చేయటానికి రాజుకు ‘దండము ‘’ఏర్పడింది .ఆ దండం మీద భయం తో సకల ప్రాణాలు సుఖాన్ని పొందటమే కాక తమ తమ ధర్మాలను అనుసరిస్తాయి’’ అనేదే మను స్మ్రుతి సారం . దండం ను అమలు పరిస్తేనే ప్రజలు సక్రమ వర్తన కలిగి ఉంటారు .కేవల స్వభావం వల్ల నడవడిక ఉండదు .దండానికి భయ పడే లోకం సుఖం గా ఉంటుంది’’అని రాజ దండానికి ఉన్న ప్రాధాన్యత ను తెలిపాడు మనువు అదే’’ దండం దశ గుణం భవేత్ ‘’గా లోకం లో మారింది .


మనువు చెప్పిన ‘’దండ నీతి శాస్త్రం ‘’లో కొన్ని మార్పులు చేసి చాణక్యుడు అర్ధ శాస్త్రం లో ఇమిడ్చాడు .దండం అంటే కర్ర పెత్తనం అనే భయం లోకం లో వ్యాపించింది ఈ భయం పోగొట్ట టానికి స్వర్గీయ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారు ‘’కౌటిల్యుని అర్ధ శాస్త్రం ‘’రాసి సామాన్యులకూ అందులో ఉన్న విశేషాలను అర్ధం చేసుకోవటానికి వీలు కల్పించారు .తన లక్ష్యాన్ని మనువు వివరించాడు –