News and Entertainment

భారతదేశం సగర్వంగా ప్రపంచానికి పరిచయం చేసిన 20 వస్తువులు

1. మొదటి విశ్వవిద్యాలయం: ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని క్రీ.పూ.700 సంవత్సరంలో తక్షశిలలో   నిర్మించారు. ఇక్కడ 300 లెక్చరర్ హాల్స్, ప్రయోగశాలలు, లైబ్రరీలు, ఖగోళ పరిశోధనలకు సంబంధించి ఉన్నాయి. దాదాపు 10000 మంది విద్యార్థులు ప్రపంచ నలుమూలల నుండి విద్యను అభ్యసించినట్లు, 200 మంది ప్రొఫెసర్లు విద్యను బోధించినట్లు, చైనాకు చెందిన హీన్ సాంగ్ తన డైరీలో రాసుకున్నాడు.

2.  ప్రపంచానికి సున్న(0)ను పరిచయం చేసిన వ్యక్తి , మనదేశానికి చెందిన ఆర్యభట్ట . నేడు సున్నాలేని కాలుకుల్యేషన్ ను ఊహించగలమా…?

3. 6 వ శతాబ్ధంలో చెస్(చదరంగం) గుప్తుల ప్రపంచానికి పరిచయం చేశారు. దీరి కాలంలో కనుగొన్న ఈ ఆటను అప్పట్లో ‘చతురంగ’ అని పిలిచేవారు


4. ప్రపంచంలో మొదటిసారిగా అలంకారిక గుండీలను మన దేశీయులే కనుగొన్నారు. సముద్రంలో లభించే షీషెల్స్ ను చొక్కాలకు గుండీలుగా ఉపయోగించారు. ఇవి రేఖాగణితం ఆకారంలో ఉండేవి. వాటికి మధ్యలో రంధ్రాలను వేసి గుండీలుగా ఉపయోగించారు.

5. వైకుంఠపాళిగా పిలవబడుతున్న పాము-నిచ్చెన ఆటను మన భారతీయులే కనుగొన్నారు. దీని అసలు పేరు ‘మోక్షపత్’. భారతదేశాన్ని బ్రిటీషులు పరిపాలిస్తున్న కాలంలో భారతదేశం నుండి ఇంగ్లాండ్ కు మరియు అమెరికాకు దారిని కనుగొనే విధంగా ఈ ఆటను 1943లో రూపొందించారు.