News and Entertainment

బరువు తగ్గాలా..ఈ డ్రింక్ త్రై చెయ్యండి


పూర్తిగా ఇంట్లోనే తయారు చేసుకోగల డ్రింక్ ఇది. మనం ప్రతిరోజూ తినే భియ్యాన్నే ప్రధాన వస్తువుగా తీసుకొనే ఈ పానీయాన్ని సేవిస్తే గనక బరువు తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట… ఈ రైస్ డ్రింక్ ను తాగడం వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చట!.. రైస్ డ్రింక్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం.

రైస్ డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు.:
బియ్యం – రెండు టేబుల్ స్పూన్లు
నీరు – తగినంత
జీలకర – తగినంత
ఎండిన అల్లం పొడి – తగినంత
మిరియాల పొడి- తగినంత

తయారు చేసే విధానం:
జీరా, అల్లం పొడి, మిరియాల పొడిలను సమాన భాగాల్లో తీసుకుని వాటిని మళ్లీ మిక్సీ పట్టి పొడిగా చేయాలి. ఈ పొడి నుంచి 1/4 టీస్పూన్ పొడిని తీసుకుని దాన్ని బియ్యానికి కలిపి ఈ మిశ్రమాన్ని మళ్లీ ఒక గ్లాస్ నీటికి కలపాలి. ఒక పాత్రలో ఈ మిక్స్ను వేసి డికాషన్లా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి దానికి కొద్దిగా ఉప్పును కలిపి తీసుకోవాలి. 


సూప్స్కు బదులుగా దీన్ని తాగితే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరుగుతుంది. అంతేకాదు కొంత ద్రవం తాగినా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది అధిక బరువు తగ్గించుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.