News and Entertainment

సోషల్ మీడియాలో మహేష్ న్యూ రికార్డ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినిమాల్లో రికార్డులు క్రియేట్ చేయ‌డం కొత్త కాదు. మ‌హేష్‌కు ఓవ‌ర్సీస్‌లో సైతం మంచి ఫాలోయింగ్ ఉండ‌డంతో అక్క‌డ కూడా రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల జోరు చూపిస్తాడు. సినిమాల్లో రికార్డుల సంగ‌తి అలా ఉంటే మ‌హేష్ ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో ఓ కొత్త‌ రికార్డు సృష్టించాడు.


ఆఫ్ లైన్లో అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించుకున్న ఆయన తాజాగా ఆన్ లైన్లోనూ తన అభిమానుల సంఖ్యను పెంచుకున్నారు. మహేశ్ ట్విట్టర్ ఖాతాను 20 లక్షల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. ఈ రికార్డు ఇంతవరకు ఏ తెలుగు హీరో సాధించకపోవడంతో ప్రిన్స్ అభిమానులు సంబరపడుతున్నారు.


టాలీవుడ్ లో ఇలా 2 మిలియన్ ఫాలోయర్లు ఉన్న హీరో మహేష్ బాబు మాత్రమే. మహేష్ బాబు తర్వాత స్థానం లో ద‌ర్శ‌క‌ధీరుడు SS.రాజమౌళి (1.9 మిలియన్) ఉండగా ఆ తర్వాతి స్థానం లో సెన్సేషనల్ ట్వీటర్ రామ్ గోపాల్ వర్మ(1.7 మిలియన్)కు ఫాలోవ‌ర్లు ఉన్నారు.


సౌత్ మొత్తం గురించి మాట్లాడుకుంటే మహేష్ బాబు కంటే ఎక్కువగా ఫాలోయర్లు ఉన్న హీరోలు ఇద్దరే. వారు రజనీకాంత్ (2.9 మిలియన్), సిద్ధార్థ్ (2 మిలియన్). ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో ట్విట్టర్ ఫాలోవ‌ర్ల విషయంలో అగ్ర స్థానం లో ఉన్న మహేష్ భవిష్యత్తులో సౌత్ లోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు.