News and Entertainment

మొదటి రాత్రే 'కన్య' కాదని చంపేశాడు


ఈ రోజుల్లో తల్లితండ్రులకు ఆడపిల్ల పెళ్లి అయ్యేవరకు ఒక ఇబ్బంది, పెళ్లి అయ్యాక మ‌రో ఇబ్బంది అన్న‌ట్టుగా ఉంది వారి ప‌రిస్థితి. పెళ్ల‌య్యాక ఆ కాపురం ఎలా ఉంటుందో అనే బెంగ ఉండటం సామాన్యం అయిపోయింది. ఎందుకంటే మగవాళ్ళు ఆ విధంగా మారిపోయారు. వారు చేసే పనులకు అర్ధమే ఉండటం లేదు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య‌ను జీవితాంతం కంటికి రెప్ప‌లా చూసుకోవాల్సిన మ‌గాళ్లు మృగాళ్లుగా మారి వారిని నానా ర‌కాలుగా హింసిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ లోని సింధ్‌ ప్రాంతంలోని జకోబాబాద్ జిల్లాలో జ‌రిగిన సంఘ‌ట‌న హృద‌య విదార‌కం అనిపిస్తుంది. పెళ్లి అయ్యిన రోజే తాను వివాహం చేసుకున్న యువతిని చంపేశాడు.

ఇక వివరాల్లోకి వెళ్ళితే….. ఖాన్ జాడి లషరి అనే 19 సంవత్సరాల యువతిని 28 సంవత్సరాల భక్ష్ ఖోకర్ అనే యువకుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ రెండు కుటుంబాల వారు సమీప బంధువులే అవుతారట. పెళ్లి వరకు బాగానే జరిగింది. పెళ్లి రోజు రాత్రి పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు మీద కన్య కాదని అనుమానం వచ్చింది. దాంతో మరో ఆలోచన లేకుండా పెళ్లి కొడుకు ఆమెను సల్వార్ సూట్ కాటన్ ట్వైన్ తో గొంతు పిసికి చంపేసి పారిపోయాడు. ఉదయం తెల్లారగానే కూతురు కన్పించకపోవటంతో వెతికితిన త‌ల్లిదండ్రుల‌కు త‌మ కుమార్తె మంచం మీద శవమై కనపడింది.

దీంతో ఆమె తల్లితండ్రులు పోలీసులకు పిర్యాదు చేయగా, అతని సెల్ ఫోన్ ఆధారంగా పట్టుకొని,పోలీసుల మర్యాద చేశాక హత్య చేశానని ఒప్పుకున్నాడు. తమ సోదరుడు కొంత భిన్నంగా ఉంటాడు. కానీ హత్య చేస్తాడని ఊహించలేదని అతని సోదరులు అంటున్నారు.