News and Entertainment

100 కోట్లపై 'NTR' కన్ను


ప్ర‌స్తుతం టాలీవుడ్ ట్రెండ్ మారింది. తెలుగుతో పాటుగా.. మరో ఒకట్రెండు బాషల్లో తెలుగు సినిమాలు వాలిపోతున్నాయి. అందుకు.. ఇటీవల రిలీజైన బాహుబలి నే నిదర్శనం. తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో ఏకకాలంలో రిలీజైన బాహుబలి అత్యధికంగా వసూలు చేసిన భారత దేశ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ పాత సినిమాలు కూడా వివిధ భాష‌ల్లో రిలీజ్ అయ్యి హిట్ కొట్టాయి. అదే ఒక సినిమాతో ఇత‌ర భాష‌ల్లో కూడా పాపులారిటీ సాధించుకుంటే త‌ర్వాత ఆటోమేటిగ్గా ఇత‌ర భాష‌ల్లో కూడా ఆయా హీరోల‌కు మార్కెట్ పెరుగుతుంది.అల్లు అర్జున్ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ కేర‌ళ‌లో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. ఎన్టీఆర్ తాజా చిత్రం ’జనతా గ్యారేజ్’ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ బాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. గతంలో ఎన్టీఆర్ చిత్రాలు హిందీలోకి డబ్ అయ్యాయి. మోహన్ లాల్ ఉండటంలో మళయాళంలో ఢోకా ఉండదు. తెలుగు, తమిళ్ లో ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పటికే రుజువైంది. దీంతో.. గ్యారేజ్ రికార్డ్ కలెక్షన్స్ ని కొల్లగొట్టడం ఖాయమంటున్నారు నందమూరి అభిమానులు.ఈ సినిమాతో ఎన్టీఆర్ రూ.100 కోట్ల వ‌సూళ్ల‌పై క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ జతకట్టనున్నారు. మళయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.