News and Entertainment

సమంత తో దానికి రీజన్ ఇచ్చేసిన పవన్

కన్నడలో ‘యూటర్న్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచే ప్ర‌మోట్ చేయ‌డం మొద‌లెట్టిన స‌మంత సినిమా రిలీజ్ అయ్యాక మ‌న నాగ‌చైత‌న్య‌ను వెంటేసుకుని సీక్రెట్‌గా బెంగ‌ళూరు చెక్కేసి మ‌రీ ఆ సినిమా చూసేసింది. ఆ సినిమాకు ఆమెకు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింద‌ట‌. ఆ సినిమాను స‌మ్మూ తెలుగు, తమిళ భాషల్లో స్వయంగా తన నిర్మాణ సారధ్యంలో రీమేక్ చేయాలనుకుందని మీడియా ఒకటే హడావిడి చేసింది.


ఈ వార్త‌ల‌పై సమంత కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే సమంత ప్రొడ్యూసర్ అవ్వడం ఖాయం అనుకున్నారంతా.. అయితే కన్నడ ‘యూటర్న్’ సినిమా దర్శకుడు పవన్ కుమార్ అసలు విషయం చెప్పుకొచ్చాడు. సమంతకు యూటర్న్ సినిమా నచ్చిన విషయం నిజమే..కాని ఆమె నిర్మాతగా చేసే విష‌యంలో ఆమె ఇంకా క్లారిటీలో లేర‌ని అస‌లు విష‌యం చెప్పుకొచ్చాడు.

ఇక యూటర్న్ చూసి ఆమె దానిలో నటించాలని ఆశపడ్డారే తప్ప ఆమెకు నిర్మించే ఆలోచన లేదని రూమర్స్ కొట్టిపారేశాడు పవన్ కుమార్. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం, త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో అ..ఆ సినిమాలు చేస్తున్న సమంత కోలీవుడ్ తేరితో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో కూడా తేరి పోలీసోడుగా రిలీజ్ అవుతుండటంతో మరింత క్రేజ్ సంపాదించింది. ఇక సూర్య 24లో కూడా సమంత హీరోయిన్ గా చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ సమ్మర్ మొత్తం హీరోల హవా ఎలా ఉన్నా సమంత మాత్రం తన స్టార్డం ను కొనసాగిస్తూ మిగతా హీరోయిన్స్ అసూయ పడేలా చేస్తుంది.