News and Entertainment

పవన్-కజల్ హాట్ లిప్-లాక్


పవన్ కళ్యాన్ సర్ధార్ గబ్బర్ సింగ్ గా రాబోతున్నారు..ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్..ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా తాజాగా కొత్త ప్రోమోలు కూడా విడుదల చేశారు. ఈ ప్రోమోలో పవన్ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు..అయన డబ్బుకి భయానికి లొంగడు ఆయనికి మీరు ఓన్ అవ్వాలంటే ముందు ట్యూన్ అవ్వాలి లేకపోతే ఫ్యాన్ అవ్వాలి. వాడు ముందు అలాగే ఉంటాడు ఆ తరువాతే అర్థం అవుతాడు.
పొగరెక్కి తలెగరేసే నీ లాంటోడు పుట్టిన ప్రతి సారి తెగ నరకడానికి నాలాంటి వాడు పుడుతూనే ఉంటాడు. ఒక్కన్నే ఒక్కన్నే ఎక్కడికైనా ఇలాగే వస్తా ఇలాగే ఉంటా జనం లో ఉంటా జనం లా ఉంటా . మనమిచ్చే ప్రతి కౌంటర్ కి ఒక మీనింగ్ ఉంటది చేసే ప్రతి ఎన్కౌంటర్ కి ఓకే టైమింగ్ ఉంది రా. చిన్నప్పటి నుండి ముద్ద పెట్టే వాళ్ళే గాని ముద్దు పెట్టే వాళ్ళు లేక ముద్దులకి కరువాసి పోయాను. వీడు అందరిలాంటి మనిషి కాదు ఈ జనంలోనుంచి పుట్టిన ఐడియాలజి.ఇలాంటి డైలాగ్స్ తో కొత్త ప్రోమోలు సర్ధార్ పై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతే కాజల్ తో పవన్ లిప్ లాక్ సీన్ చూస్తుంటే ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్ కి ఎలాంటి మాసాల కావాలో అన్ని ఈ చిత్రంలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి..పవన్ పవర్ ఫుల్ పంచ్ డైలాగులు, తుపాకీలతో హంగామా, బోలెడంత కామెడీ,ఎమోషన్స్ అన్నీ కలగలిపిన చిత్రంగా సర్ధార్ ఏప్రిల్ 8 న విడుదల కాబోతుంది.