News and Entertainment

NTR మీద షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్



తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా పవనీజం..పవన్ మానియా కొనసాగుతుంది. త్వరలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ గా పవన్ థియేటర్లో హంగామా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంపై విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అంతే కాదు పవన్ కళ్యాన్ ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు..ఈ సందర్భంగా ఇప్పటికే నేషనల్ మీడియాకు ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. తాజాగా బాలీవుడ్ లో ప్రమోషన్ బిజీలో ఉన్న పవన్ కళ్యాన్ తాజాగా ఎన్టీఆర్ ని తెగ పొగిడారు..ఆ..ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు..తెలుగు చలన చిత్ర సీమంలో మకుటం లేని మహరాజులా వెలిగిపోయిన నటసార్వభౌములు నందమూరి తారక రామారావు. తెలుగు చిత్రసీమలో ఆయనకు ఆయనే సాటి అన్నారు.


పౌరాణికం,జానపదం,సాంఘీక చిత్రాల్లో ఎలాంటి పాత్రకైనా సరైన న్యాయం చేయగల మహానటుడు ఎన్టీఆర్ అని అన్నారు. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీకి రాకముందు తనకు బాలీవుడ్ హీరో అమితాబచ్చన్ అంటే తెగ అభిమానంచే వారని తర్వాత మెగాస్టార్ చిరంజీవి అంటే పిచ్చి అభిమానం అని అన్నారు. అయితే వీరిద్దరి కన్నా ఎన్టీఆర్ అంటే చాలా గౌరవం..అభిమానం అని అన్నారు. ఈ మద్య  బాలీవుడ్ మీడియా కు ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.


సీనియర్ ఎన్టీఆర్ కు ఎవరూ సాటి రారు,ఆయన లాంటి నటుడు ఎవరూ లేరు  అంటూ ఎన్టీఆర్ ని పొగిడి సంచలనం సృష్టించాడు పవన్. ఇక సర్ధార్ గబ్బర్ సింగ్ కోసం టీమ్ ఎంతో కష్టపడిందని సినిమాలో అద్భుతమైన సెట్టింగ్స్ ఉన్నాయని పూర్తి ఎంట్రటైన్ మెంట్ గా సినిమా వచ్చిందని ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు.ఇక సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు పవన్