News and Entertainment

రాజమౌళి-మహెష్ లకు షాక్ ఇచ్చిన పవన్ కామెంట్స్


పవన్ కళ్యాణ్ తో నిన్న రాత్రి ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ సిఎన్ఎన్ ఐబిఎన్ ప్రసారం చేసిన ఇంటర్వ్యూలో రాజమౌళి మహేష్ లను కార్నర్ చేస్తూ పవన్ చేసిన కామెంట్స్  మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా విడుదల సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ మరియు విశ్లేషకుడు రాజీవ్ మసాద్ పవన్ తో చేసిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ ఈ కామెంట్స్ చేసాడు. తన సినిమాలతో పాటు  రాజకీయ, సామాజిక అంశాల పై రాజీవ్ మసాద్ అడిగిన అనేక ప్రశ్నలకు పవన్ చాలలోతైన సమాధానాలు ఇచ్చాడు. 




దేశంలో చాలా సమస్యలు ఉంటే రోహిత్‌ వేముల విషయాన్ని రాజకీయ పార్టీలు ఎందుకు హైలైట్‌ చేస్తున్నాయని పవన్ ఈ ఇంటర్వ్యూలో రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ ప్రశ్నించాడు. రోహిత్‌ వేముల సంఘటన విద్యార్థుల సమస్య మాత్రమే అని అంటూ ఇందులో రాజకీయ నాయకులు ఎందుకు కలగా చేసుకున్నారో తనకు అర్ధం కావడం లేదు అని షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇదే సందర్భంలో బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ చేసిన అసహనం కామెంట్స్ గురించి మాట్లాడుతూ ఆ మాటను జనరలైజ్‌ చేయడం సరికాదని ప్రకటన చేసి పారిపోవడం అమీర్ ఖాన్ స్థాయికి తగని విషయం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు పవన్...Next Page