News and Entertainment

శ్రీజ పెళ్ళిలో పవన్ వైఫ్ హల్-చల్



టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్ర‌స్తుతం స‌ర్దార్ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ త‌న అన్న చిరు చిన్న కుమార్తె శ్రీజ వివాహ వేడుక‌తో పాటు రిసెప్ష‌న్‌కు కూడా దూరంగా ఉన్నాడు. 

ప‌వ‌న్ త‌న మాజీ భార్య రేణుదేశాయ్‌కు విడాకులిచ్చాక త‌న‌తో పాటు తీన్‌మార్ సినిమాలో న‌టించిన అన్నా లెజ్ నోవా అనే మహిళతో కలిసి ఉంటున్నారు. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారని కథనాలు వచ్చాయి. అయితే ఆమె మాత్రం ఎన్నడూ బయటకు రాలేదు.


తాజాగా చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లిలో ఆమె సందడి చేసింది. చిరు సతీమణి పక్కనే నిలబడి ఆమె ఫోటోలకు ఫోజులివ్వడం గమనార్హం. ఈ ఫొటోలో సంప్ర‌దాయ దుస్తుల్లో క‌ళ‌క‌ళ‌లాడుతూ క‌నిపిస్తున్న అన్నా! చీర‌క‌ట్టులో నిండైన తెలుగు మ‌హిళ‌గా.. క‌నిపిస్తోంది. 

శ్రీ‌జ వివాహ వేడుక‌కు చాలా మంది వ‌చ్చినా ఆమె స్పెషల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. తీన్‌మార్ సినిమాలో ప‌వ‌న్‌కు ఆమెకూ ప‌రిచయం ఏర్ప‌డింది. అక్క‌డే వారిప్రేమ చిగురించింది. ర‌ష్య‌న దేశ‌స్థురాలైన ఆమెను ప‌వ‌న్ 2013లో వివాహం చేసుకున్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.