News and Entertainment

జరగబోయే కీడుఎలా తెలుసుకోవాలి....!!


పరాశరుడు జరుగబోయే కీడు ఎలా తెలుసుకోవాలి అన్నది వివరించాడు. ఉత్తరదిక్కున బంగారు వర్ణం కలిగి ఉన్న వానిని , దక్షిణ ముఖంగా నిలిచి ఉండడం చూసిన వానికి మూడు సంవత్సరాలలో మరణం సంభవిస్తుంది అని తెలుసుకోవాలి. సూర్యబింబం తేజోవిహీనంగా కనిపించిన వానికి రెండు సంవత్సరాలలో మరణం సంభవిస్తుంది. 

వెన్నెలలో కనపడే తన నీడకు చిల్లులు కనబడడం చూసిన వానికి ఒక సంవత్సరంలో మరణం సంభవిస్తుంది అని తెలుసుకోవాలి. తన నీడ తల లేకుండా కనపడిన ఆరు నెలలో మరణం సంభవిస్తుందని తెలుసుకోవాలి. చెవులను చేతులతో మూసినప్పుడు ఏ శబ్దం వినిపించక ఉన్న అతడికి నెల రోజులలో మరణం సంభవిస్తుంది అని తెలుసుకోవాలి. 

చెవులు ముక్కులు పని చేయక కళ్ళలో జీవం పోయి కనిపించిన అతడికి అది ఆఖరి రోజని తెలుసుకోవాలి. పైన చెప్పిన అరిష్టములు సంభవించినప్పుడు మానవుడు ధైర్యం కోల్పోకూడదు. ముందు జీవితము మీద కోరికను ఆశలను వదిలి పెట్టాలి. మనసు నిలకడగా ఉంచుకుని ఏకాగ్రచిత్తులై ధ్యానం చేసిన పరమాత్మ అనుగ్రహం పొందాలి. అటువంటి వ్యక్తి మరణించిన మరుజన్మలో అతడి కర్మఫలమును అనుసరించి విప్ర, వైశ్య, క్షత్రియ కులములలో సంపన్నుడై జన్మించి సుఖములు అనుభవించి పరలోకములో కూడా సుఖములు అనుభవిస్తాడు


loading...