News and Entertainment

అమీర్ పేట మసాజ్ సెంటర్ లో వ్యభిచారం
మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు యువతులను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.... అమీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

వెస్ట్ జోన్ పోలీసుల కథనం ప్రకారం.. మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం అందగానే దాడి చేసి నిర్వాహకుడితో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు నలుగురు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం ప్రేమ పేరుతో యువతిని నమ్మించి.. పెళ్లి నిశ్చితార్థం కూడా చేసుకొని, ఆ తర్వాత ముఖం చాటేశాడు ఓ యువకుడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు లైంగిక దాడి, చీటింగ్ కేసులు నమోదు చేశారు. ఎల్‌బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... సైదాబాద్ కాలనీకి చెందిన శివ ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో బీడీఎస్ చదువుతున్నాడు. 

ఎల్బీనగర్‌కు చెందిన యువతి (28) వైద్యురాలు. వీరిద్దరికీ 2004లో పరిచయమైంది. ఇద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకుని.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన అవసరాల నిమిత్తం యువతి నుంచి పలుమార్లు డబ్బు కూడా తీసుకున్నా డు. పెద్దలు వీరిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని 2016 ఫిబ్రవరి 14న నిశ్చితార్థం చేశారు. అనంతరం బంగారం నగదును ఇరు కుటుంబ సభ్యులు ఇచ్చి పుచ్చుకున్నారు. అంతేకాదు ఈనెల 22న పెళ్లి జరపాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. శివ తన చదువు కోసం యువతి కుటుంబ సభ్యుల నుంచి రూ.4.5 లక్షల నగదును తీసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొమ్మని అడగ్గా శివ తాను పెళ్లి చేసుకోనని ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు తన కుటుంబలతో శుక్రవారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శివపై లైంగిక దాడి, నమ్మకద్రోహంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.