News and Entertainment

రాజమౌళి-శంకర్ ల బిగ్ ఫైట్



బాహుబ‌లి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ సినిమాను ఎన్నో జాగ్ర‌త్త‌ల‌తో తెర‌కెక్కిస్తున్నాడు. ప‌క్కా ప్లానింగ్‌తో తెర‌కెక్కుతున్న బాహుబ‌లి 2 సినిమా 2017 ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామ‌ని ఇప్ప‌టికే చెప్పేశారంటే రాజ‌మౌళి టీం ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజ‌మౌళి బాహుబ‌లి 2కు పోటీగా ర‌జ‌నీకాంత్ రోబో 2.0 వ‌స్తోంద‌ని స‌మాచారం.



ర‌జ‌నీకాంత్‌-శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రోబో సినిమా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా రోబో 2.0 సినిమా తెర‌కెక్కుతోంది. దాదాపు రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను కూడా వ‌చ్చే యేడాది ఏప్రిల్ 14నే విడుదల చేయాలని నిర్ణయించాడట శంకర్. ఆ రోజు త‌మిళ‌ల‌కు అత్యంత ఇష్ట‌మైన పండ‌గ ఉగాది కావ‌డంతో శంక‌ర్ రోబో 2.0 రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.

బాహుబలి2 తో టఫ్ కాంపిటీషన్ ఉంటుందని తెలిసినా.. ఈ విషయంలో శంకర్ ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. శంక‌ర్‌కు త‌న సినిమాపై ఉన్న న‌మ్మ‌కంతోనే ఏప్రిల్ 14న రోబో 2.0కు రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు కోలీవుడ్ టాక్‌? రోబో 2.0 రూ.350 కోట్ల‌తో, బాహుబ‌లి 2 రూ.200 కోట్ల‌తో తెర‌కెక్కుతున్నాయి. 



ఈ లెక్క‌న చూస్తే వ‌చ్చే ఏప్రిల్ 14న రూ.550 కోట్ల బ‌డ్జెట్‌కు భ‌విష్య‌త్తు తేలాల్సి ఉంది. రెండు పెద్ద సినిమాలు కావ‌డంతో ఆ రీలీజ్ టైంకు ఏదో ఒక సినిమా 2-3 వారాలు వాయిదాప‌డే సూచ‌న‌లు ఉన్నాయంటున్నారు కొంద‌రు. మ‌రి బాహుబ‌లి 2, రోబో 2.0 సినిమాల రిలీజ్ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూద్దాం.