News and Entertainment

బికిని లో రకుల్ ప్రీత్ సింగ్





సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఉన్న గ్లామర్ కారణంగా తనకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో తను ఎక్స్ పోజింగ్ చేయటానికి రెడీ అంటూ గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొంత మంది డైరెక్టర్స్, రకుల్ ప్రీత్ సింగ్ కి ఇచ్చిన ఆఫర్ ని వాడుకున్నప్పటికీ…పూర్తి స్థాయిలో మాత్రం తన అందాలను చూపించలేకపోయారు.

అయితే ఇప్పుడు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ అందాలు పూర్తి స్థాయిలో కనిపించనున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కోలీవుడ్ చిత్ర రంగంపై సత్తా చాటాలని చూస్తుంది. శ్రుతిహాసన్, తమన్న, సమంత, అనుష్క వంటి హీరోయిన్స్ మాత్రమే అక్కడ టాప్ లిస్ట్ లో ఉన్నారు.

ఇప్పుడు వీరంత ఫుల్ బిజిగా మారడంతో కొన్ని ఆఫర్స్ ని అయినా కోలీవుడ్ లో చేజిక్కించుకోవాలని ఈ బ్యూటీ చూస్తుంది. అందులోని భాగంగానే ఇప్పుడు విశాల్ సరసన నటించే ఛాన్స్ ని ఈ బ్యూటీ దక్కించుకుంది. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ ఇప్పుడు 'తుప్పారివాలన్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అలాగే హీరోగానూ నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ పాత్రకు రకుల్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఈ మూవీలో విశాల్ సరసన ఈ బ్యూటీ బికినిలో కనిపించనుంది. అందుకు రెమ్యునరేషన్ ని కూడ భారీగానే తీసుకుంటుంది. కథకి ఎంత అవసరమే అంత వరకే తను ఎక్స్ పోజింగ్ చేస్తాను కానీ…కేవలం బికినితో ధరించి సాంగ్స్ లో డ్యాన్స్ చేయటం వంటి క్రేజీ పనులు తను చేయనని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకు రావటం ఎంతో విశేషం.