News and Entertainment

సర్ధర్ పై బెట్టింగ్..న్యూడ్ గా ఆంద్ర తెలంగాణ లో పరిగెడతా!


ఇటీవల కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ బాలీవుడ్ ప్రముఖుడు కమల్ ఖాన్ మరోసారి తన ట్విట్టర్ అకౌంట్ కు పని చెప్పారు. ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా ఏప్రిల్ 8వ తేదీన బాలీవుడ్ లో దాదాపు 800 ధియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కాబోతున్న నేపధ్యంలో వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మకు – కమల్ ఖాన్ కు మధ్య ట్విట్టర్ వేదికగా ‘ఛాలెంజ్’ల పర్వం జరిగింది. 

‘సర్ధార్ గబ్బర్ సింగ్’ను పొగుడుతూ వర్మ చేసిన ఓ ట్వీట్ కు స్పందించిన కమల్ ఖాన్ మాటలు చివరికి వర్మ – కమల్ ల మధ్య బెట్టింగ్ కు కారణమయ్యాయి. ‘బాహుబలి’ మొదటి రోజున ప్రసాద్ ఐమాక్స్ ధియేటర్ వద్ద దాదాపు 1.5 కిలోమీటర్ల ‘క్యూ’ ఉందని, ఇపుడు ‘సర్ధార్ గబ్బర్ సింగ్’కు ఎంత లైన్ ఉంటుందో చూడాలి అంటూ వర్మ చేసిన ట్వీట్ కు ‘0 కిలోమీటర్లు’ అంటూ నవ్వుతూ కమల్ ఖాన్ బదులిచ్చారు. 

పవన్ ను ఎవరితో పోల్చవద్దని, పవన్ కంటే హిందీలో కట్టప్ప పెద్ద స్టార్ అని, రాజ్ పాల్ యాదవ్ లాగా కనపడే పవన్ సినిమాకు ఉచిత టికెట్ + రవాణా చార్జీలు + కూల్ డ్రింక్ + పాప్ కార్న్ ఇచ్చినా గానీ హిందీ ప్రేక్షకులు పవన్ సినిమాకు వెళ్ళరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే పవన్ కళ్యాణ్ అత్యంత క్రేజీ నటుడు, ఇది కమల్ ఖాన్ అర్ధం చేసుకోవాలని వర్మ చేసిన ట్వీట్ కు ....NEXT PAGE