News and Entertainment

స‌ర్దార్ క‌లెక్ష‌న్స్(1st Day) అంచ‌నా



సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ మేనియా తెలుగు రాష్ట్రాలని, తెలుగు వారిని పట్టుకు ఊపేస్తోంది. రెండు తెలుగు రాష్ర్టాల్లోను, ఓవ‌ర్సీస్‌లోను స‌ర్దార్ హంగామా ఓ రేంజ్‌లో జ‌రుగుతోంది. ఇక ఆస్ర్టేలియా, అమెరికాలో ఫ‌స్ట్ వీకెండ్ వ‌ర‌కు స‌ర్దార్ టిక్కెట్లు ఫుల్ అయిపోయాయి. తెలుగు రాష్ర్టాల్లో విడుదలకి నాలుగైదు రోజుల ముందు నుంచే అడ్వాన్స్‌ బుకింగ్‌ స్టార్ట్ అవ్వ‌డంతో ఇక్క‌డ కూడా అడ్వాన్స్ బుకింగ్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది.

మొదటి రోజు షోస్‌కి టికెట్లు ఇక కౌంటర్లలో దొరికే పరిస్థితి లేదు. బ్లాక్‌లో ఎంత అమ్ముతారనేది ఊహకే అందడం లేదు. రెండో రోజు, మూడో రోజు కూడా బుకింగ్స్‌ ఆల్‌మోస్ట్‌ క్లోజ్‌ అయిపోయాయి. ఇంకా మల్టీప్లెక్స్‌ బుకింగ్స్‌ స్టార్ట్‌ కాలేదు కానీ ఈలోపే సింగిల్‌ స్క్రీన్స్‌ అన్నీ బుక్‌ అయిపోయాయి.


ఫ‌స్ట్ డే అయితే బ్లాక్‌లో రూ.1000కు త‌క్కువ‌గా టిక్కెట్టు దొరికే ప‌రిస్థితి లేదు. యుఎస్‌లో రెండు వందల లొకేషన్లలో షోస్‌ ప్లాన్‌ చేసి పాతిక డాలర్లకి టికెట్స్‌ అమ్మినా కానీ కొనేస్తున్నారు. ఇక్క‌డ‌ ప్రీమియర్స్‌ పరంగా పవన్‌కళ్యాణ్‌ కొత్త బెంచ్‌ మార్క్‌ పెట్టడం ఖాయమని అంటున్నారు.


స‌ర్దార్‌కు రిలీజ్‌కు ముందు వ‌స్తు్న క్రేజ్ చూస్తుంటే తొలి రోజున తెలుగు రాష్ట్రాల నుంచే ఇరవై కోట్ల వరకు షేర్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ వ‌చ్చినా రికార్డుల దుమ్ము రేప‌డం క‌న్‌పార్మ్ అని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేసుకుంటున్నాయి. ఇక థియేట‌ర్ల‌ను కూడా స‌ర్దార్ క‌బ్జా చేసేశాడు. రెండు తెలుగు రాష్ర్టాల్లో 1500, బాలీవుడ్‌లో 800 థియేట‌ర్లు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా 3500 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌నున్నారు.