News and Entertainment

సర్ధార్ రేటింగ్ వచ్చేసిందోచ్: 5/5


ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తాజా చిత్రం స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు కొద్ది గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చ‌రిత్ర‌లోనే స‌ర్దార్‌కు వ‌చ్చిన హైప్ ఏ సినిమాకు రాలేదు. ప‌వ‌న్ పొలిటిషియ‌న్‌గా మారాక సోలో హీరోగా న‌టించిన సినిమా కావ‌డంతో స‌ర్దార్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. స‌ర్దార్ బెనిఫిట్ షోల హంగామా ఈ అర్ధ‌రాత్రి నుంచే స్టార్ట్ కానుంది.



అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే యూఎస్ఏ/ యూకేల‌లో ఫిల్మీ మ్యాగ‌జైన్ ఎడిట‌ర్ అయిన ఉమైరా సాంధూ స‌ర్దార్‌కు టాలీవుడ్ హిస్ట‌రీలోనే దిమ్మ‌తిరిగిపోయే రేటింగ్ ఇచ్చారు. స‌ర్దార్ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అని చెప్పిన ఉమైరా సాంధూ స‌ర్దార్‌కు 5కు 5 రేటింగ్ ఇచ్చేశారు. అమెరికాలోని మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను చూసిన ఉమైరా ఈ రేటింగ్ ఇవ్వ‌డం విశేషం.

స‌ర్దార్ ప‌క్కా పైసా వ‌సూల్ సినిమా అని చెప్పిన ఉమైరా సంధూ ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని తేల్చేశారు. పోలీస్‌గా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, రాజ‌కుమారి అరిషి పాత్ర‌లో కాజ‌ల్ యాక్టింగ్ సూప‌ర్బ్ అని పొగిడేశారు. ఇక సినిమాలో ప‌వ‌న్ స్టైల్ పంచ్ డైలాగ్స్‌తో పాటు యాక్ష‌న్ స‌న్నివేశాలు అదిరిపోయాయ‌ని ఉమైరా చెప్పారు. సినిమా స్టోరీ లైన్ సూప‌ర్బ్ అని…సినిమా ర‌న్ చేసిన విధానం బాగుంద‌ని కితాబిచ్చారు. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న ప‌వ‌న్ అభిమానుల ఆంన‌దానికి అవ‌ధులు లేవు.


Also Read: