News and Entertainment

స్త్రీని సంతృప్తిపరచే సెక్స్ టిప్స్


శృంగారంలో స్త్రీని ఎలా సంతోషపెట్టాలో మగాడికి బాగా తెలిసి ఉండాలి. కేవలం సంభోగంలో అంగ ప్రవేశం ద్వారా మాత్రమే మహిళ భావప్రాప్తిని, ఆనంద పారవశ్యాన్ని పొందలేదనే విషయాన్ని పురుషుడు ప్రాథమికంగా తెలుసుకోవాలి. మహిళకు సంబంధించిన కొన్ని రహస్యమైన గ్ర‌హించిన త‌రువాతే సెక్స్ జీవితాన్ని సార్ధ‌కం చేసుకుంటాడు అనేది మ‌గ‌వాడు తప్పకుండా తెలుసుకుని ఉండాలి. శృంగార జీవితానికి కొన్ని టిప్స్ సెక్స్ నిపుణులు అందించిన సూచ‌న‌లు ఇలా..

* మహిళలు తమ పురుషుడు తమతో సంభాషణ జరపడాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు. వారు చెప్పే విషయాలను శ్రద్ధతో వినాలి. ఇద్దరు కలిసి నడుస్తున్నప్పుడు లేదా తీరికగా కూర్చున్నప్పుడు వారిని మాటల్లోకి దించాలి. తాను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలి. తనకు అత్యంత ఆత్మీయురాలు ఆమె తప్ప మరెవరూ లేరని నమ్మకం క‌లిగించాలి.

* ఇద్దరు కలిసి ఉంటున్నప్పటికీ కొన్నిసార్లు అతను తనను పట్టించుకోవడం లేదనే భావనకు ఆమె గురవుతుంది. అందువల్ల, అప్పుడప్పుడు ఆమె వైపు చూపుల చురకత్తులతోనో, ఆరాధనా భావంతోనో కదిలించాలి. దాదాపుగా ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడి మహిళ దుస్తులు విప్పేస్తుంది. అటువంటి వేళల తనకు చూడాలని ఉందనే ఆకాంక్షను తమ చూపుల ద్వారా పురుషుడు వెల్లడించాలి. చాలా అందంగా ఉన్నావంటూ ప్రశంసించాలి.



* మహిళకు శృంగారం మిగతా జీవితంతో వేరు కాదు. దాన్ని కూడా ఆమె తన నిత్య జీవితంలో భాగంగానే చూస్తుంది. రతిక్రీడ ద్వారా జీవితంలోని ఇతర ఒత్తిళ్లకు దూరమయ్యేలా ఆమెను ప్రోత్సహించాలి. మంచి భావనల వల్ల, అనుభవం వల్ల ఆమె సెక్స్‌లో సంతృప్తి పొందుతుంది. కఠినంగా మాట్లాడడం, దూరంగా నెట్టేయడం, విమర్శించడం వంటివి ఆమెపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయి. శృంగారంలో పూర్తి సానుకూలతతో పాల్గొనేలా ఆమెను సిద్ధం చేయాలి.

* స్కలనంతో స్త్రీ సంతృప్తి చెందుతుందనే తప్పుడు భావనతో చాలా మంది పురుషులు ఉంటారు. అది అవసరమే. కానీ అన్ని సందర్భాల్లో అదే అంతిమం కాదు. భాగస్వామి నుంచి స్పర్శను, .....Next Page
loading...