News and Entertainment

హాట్ సమంత షాకింగ్ న్యూస్


తెలుగు ఇండస్ట్రీలో ఏం మాయ చేశావే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అయిన మళియాళి భామ సమంత రాథోడ్. తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ మంచి హిట్స్ కావడంతో స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది. తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అక్కడ కూడా మంచి ఆదరణ పోందింది. అయితే గత కొంత కాలంగా ఈ అమ్మడు దూకుడికి కాస్త బ్రేక్ పడినట్లే చెప్పాలి..ఎందుకంటే గత సంవత్సరం అల్లు అర్జున్ తో ‘ సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో మాత్రమే కనిపించింది. అయితే మహేష్ బాబు సరసన బ్రహ్మోత్సవం, త్రివిక్రమ్ దర్శకత్వంలో అ..ఆ.. చిత్రంలో నటిస్తుంది.



ఇకపోతే సమంత ఈ మద్య అక్కినేని నాగ చైతన్యతో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతుందని వార్తలు వచ్చాయి..కానీ అవన్నీ రూమర్లే అని తేల్చి చెప్పిన సమంత కన్నడంలో ''యు టర్న్’ చూడటానికి వెళ్లినట్లు తెలిపింది. అంతే కాదు ఈ అమ్మడు మరో షాకింగ్ న్యూస్ కూడా అభిమానులకు ఇవ్వబోతుందట..సమంత ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.



కానీ కన్నడ చిత్రం ''యు టర్న్ '' రీమేక్ హక్కులు తీసుకుందట దాంతో సమంత నిర్మాతగా మారుతోంది అంటూ కథనాలు వస్తున్నాయి అయితే సమంత మాత్రం ఇంకా స్పందించలేదు. గతంలో కొంత మంది హీరోయిన్లు నిర్మాణ రంగంలోకి వెళ్లి చెతులు కాల్చుకున్న విషయం తెలిసికూడా ఈ అమ్మడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడ ఏమిటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.