News and Entertainment

సన్నీ లియోన్ తో కాన్సర్ వస్తుందట! జాగ్రత్త!

ఈ మద్య ఎక్కడ చూసిన పాన్ మసాలా యాడ్ లు కుప్పలు తెప్పలుగా దర్శనం ఇస్తున్నాయి..మా పాన్ మసాలా తింటే మైమరిచిపోతారని, మా పాన్ మసాలా తింటే నోరు రిఫ్రెష్ అవుతుందని మరొకరు ఇలా ఎవరికీ వారే తమ ఉత్పత్తులను మార్కెట్ లో ప్రచారం చేస్తున్నాయి.. అంతేకాదు క్రేజ్ ఉన్న సినీ స్టార్స్ తో ఈ ప్రచారం చేయించడం వల్ల వీటిని తినే వారి సంఖ్యా రోజురోజుకి మరింత పెరిగిపోతున్నారు. 

బాలీవుడ్ బాద్ష షారుక్ ఖాన్, అజయ్ దేవ్ గన్, హాట్ సెక్సీ బ్యూటి సన్నీ లియోన్.. ఇలా పలువురు సినీ స్టార్స్ పాన్ మసాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం వల్ల నోటి కేన్సర్ కేసులు పెరుగుతున్నాయని తాజా నివేదికలో తేలింది..


దీంతో ఢిల్లీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది..వెంటనే పాన్ మసాలాలను ప్రమోట్ చేస్తున్న సినీ తారలకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. దయ చేసి ఇక ముందు పాన్ మసాలాను ప్రమోట్ చేయొద్దని తెలిపింది. పాన్ మసాలాల్లో కేన్సర్ కారక పదార్ధాలు ఉన్నాయని, వాటి వల్ల నోటి కేన్సర్ వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పాటించి సినీ తారలు పాన్ మసాలాలను ప్రమోట్ చేయడం అపుతారో లేక మనం ఎలాగు తినం కదా అని అలాగే ప్రమోట్ చేస్తారో చూడాలి మరి.