News and Entertainment

మంగళ, శుక్రవారాలు ఎవ్వరికీ డబ్బు ఎందుకివ్వకూడదు? కారణం ఏమిటి?


మంగళ వారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు చేయకూడదు.


ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు . మంగళవారం అప్పు తీసుకొన్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. కొందరు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు, కొందరు బూజులు కూడా దులపరు, కొందరు పుట్టింటినుంచి ఆడపిల్లని పంపరు. ఆడపిల్లని ఇంటి లక్ష్మీ దేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ రెండు రోజులూ డబ్బులివ్వటంగానీ, అమ్మాయిని పంపటంగానీ చెయ్యరు.    Next>>