News and Entertainment

అందరికీ ముస్లిం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉండాలి ? ఎందుకు ?


భారతీయులంటే మంచి మంచి, రకరకాల వంటలకి ఫేమస్. అలాగే రకరకాల సంస్కృతులు, మతాల, ఆచారాలు, సంప్రదాయాల సమ్మేళనం ఇండియా. అయితే ముస్లింల వంటలు మరింత నోరూరిస్తాయి. ముస్లింలు వంటల్లో ఘనాపాఠీలని చెప్పవచ్చు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముస్లింలు మాత్రమే అత్యంత రుచికరమైన బిర్యానీ చేస్తారని గట్టి విశ్వాసం ఉంది.బిర్యాని మాత్రమే కాదు ఇతర వంటలు కూడా ముస్లింలు బాగా చేస్తారు. అంతేకాదు ముస్లింలు మంచి మనసున్నవాళ్లు. కాబట్టి మీకు ముస్లింలు స్నేహితులుగా ఉంటే ఎన్ని లాభాలో తెలుసా? అనుకోకుండా మీరు ఎప్పుడైనా ముస్లింల ఇంటికి వెళ్తే ఇంట్లో తయారు చేసిన రెండు మూడు రకాల స్వీట్లు, ఘుమ ఘుమలాడే బిర్యానీ గిన్నె పక్కన పెట్టి ఉంటాయి. 

ఇక వాళ్ల పెళ్ళిళ్లు ఎంత కలర్ ఫుల్ గా ఉంటాయో చెప్పనక్కరలేదు. డార్క్ అండ్ కలర్ ఫుల్ డ్రెస్సుల్లో చాలా హుందాగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. అసలు ముస్లింలు మీకు స్నేహితులుగా ఉంటే కలిగే లాభాలేంటో చూద్దాం.