News and Entertainment

కుక్క తో సెక్స్..మరణించిన యువతి



ప్రపంచవ్యాప్తంగా శాంతి సామరస్యాలను పరిరిక్షించడానికి ఐక్యరాజ్యసమితి నియమించిన పీస్‌ కీపర్స్‌ (శాంతి దూతలు) ఆఫ్రికా ఖండంలోని అమాయక బాలికలపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి దూతలు, సిబ్బంది తమపై అత్యాచారం చేశారని మధ్య ఆఫ్రికాకు చెందిన 98 మంది బాలికలు ఇటీవల‌ఒ యునిసెఫ్‌కు ఫిర్యాదు చేశారు. 



ఐక్యరాజ్యసమితిలో పనిచేసిన ఓ ఫ్రెంచి మిలిటరీ కమాండర్‌ తమను కట్టేసి, నగ్నంగా మార్చి కుక్కతో శృంగారంలో పాల్గొనమని బలవంతం చేశాడని ముగ్గురు బాలికలు యూఎన్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆఫీసర్‌ ముందు వెల్లడించారు. తమతోపాటే అలా కుక్కతో శృంగారంలో పాల్గొన్న నాలుగో యువతి.. కొన్ని రోజుల తర్వాత అంతుచిక్కని వ్యాధితో మరణించిందని ఆ ముగ్గురు యువ‌తులు తెలిపారు.



కొంతకాలంగా సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, కాంగో ప్రాంతాల్లో యూఎన్‌ పీస్‌ కీపర్లు లైంగిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని, బాలికలను వేధిస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రెంచి దళానికి చెందిన వారే ఇలాంటి అకృత్యాలకు ఎక్కువగా పాల్పడుతున్నట్టు తెలిసింది. పైగా కొంతమంది పోలీసుల విచారణలోనే తమ శృంగార లీలల గురించి అంగీకరించారట. 



బాధితురాలితో సెక్స్‌ జరిపిన మాట వాస్తవమేనని, అందుకోసం ఆమెకు డబ్బులు కూడా ఇచ్చామని చాలామంది తమ కమాండర్‌, పోలీసుల ముందే నిర్భయంగా చెబుతున్నారట. ఈ నేపథ్యంలో ఆ రిపోర్టుల గురించి విచారించేందుకు ఐక్యరాజ్యసమితి కొంతమంది సభ్యుల బృందాన్ని అక్కడకి పంపించింది.