News and Entertainment

పవన్ ఫాన్స్ కి అరవింద్ షాక్


నిన్న ‘సరైనోడు’ ఆడియో  సక్సెస్  మీట్ లో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ను టార్గెట్  చేసినట్లు ఉన్నాయని పవన్ అభిమానులు బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘నేను ప్రతీది జరిగిపోతుంది అనుకోను నేను తీసే ప్రతీ సినిమాకు సంబంధించి ప్రతీ విషయం సరిగ్గా ఉండేలా ఒకటి వంద సార్లు చూసుకుంటాను. ఇన్ని జాగ్రత్తలు నేను తీసుకున్నా నేను తీసిన సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అన్న టెన్షన్  నాకు ఎప్పుడు ఉంటుంది. అందుకే నిరంతరం మంచి సినిమాలు తీయడానికి  ప్రయత్నిస్తాను’  అన్న కామెంట్స్ పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ను టార్గెట్ చేసేవిగా ఉన్నాయి అని పవన్ అభిమానులు బాధ పడుతున్నట్లు టాక్.


పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో తాను  ఏమిచేసినా ఏమి తీసినా ప్రేక్షకులు చూస్తారు  అని మితి మీరిన ఆత్మా విశ్వాసంతో తీయడం వలన ‘సర్దార్’ ఫెయిల్ అయింది అన్న కామెంట్స్ రావడంతో ఆ కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని అల్లు అరవింద్ ఇలా  అన్యాపదేశం గా  మాట్లాడాడు  అని పవన్ అభిమానుల భావన. అయితే అల్లుఅరవింద్ ఈ మాటలు ఎందుకు  అన్నాడో తెలియకపోయినా  పవన్ అభిమానులు మాత్రం అరవింద్ పై అసహనంగా ఉన్నట్లు టాక్.

ఇది ఇలా ఉండగా ఇదే ఫంక్షన్ లో అల్లుఅర్జున్ ‘ఎదుటోళ్లుతో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉంది ఇంకా’ అంటూ వేసిన సెటైర్లు ఎవరిని ఉద్దేసించి వేసినవి అనే విషయమై కూడ ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. అంతే కాదు ఈరోజు ‘నేను  ప్రేక్షకుల ముందు నిలబడ్డాను అంటే అది చిరంజీవిగారి వల్లే, నేనే కాదు పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, శిరీష్‌, సాయిధరమ్‌తేజ్‌ ఇలా మా కుటుంబం నుంచి ఎవరు వచ్చినా అది చిరంజీవిగారు వేసిన దారి వల్లే ఆయన లేకపోతే మేం లేం'  అంటూ కామెంట్స్ చేసి మెగా అభిమానులను టోటల్ గా ఓన్ చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ప్రయత్నించాడు అల్లుఅర్జున్.


మొత్తం  మీద  అరవింద్ పవన్ ను దృష్టిలో పెట్టుకుని సెటైర్లు  వేస్తే కొడుకు బన్నీ చిరంజీవిని పొగిడి వ్యూహాత్మకంగా తండ్రి కామెంట్స్ ను సరి పెట్టాడు అనుకోవాలి..