News and Entertainment

సిగరెట్ తాగనివ్వరు..అమ్మాయికి ముద్దు పెట్టనివ్వరు..కడుపు చెయ్యనివ్వరు


ఈ మధ్య కాలం లో నందమూరి బాలకృష్ణ తీవ్రమైన వివాదాలలో ఇరుక్కుంటున్నారు . వేలాది జనం ఆడిటోరియం లో ఉండగా , లక్షలాది జనం టీవీ లలో చూస్తూ ఉండగా " అమ్మాయిల వెనకాల పడి కడుపు చేసేయ్యడమే లేదంటే ఫాన్స్ ఒప్పుకోరు " అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు ఆయన సావిత్రి ఆడియో ఫంక్షన్ లో. 


ఆయన కాంటెక్స్ట్ ఏదైనా కావచ్చు కానీ వెళ్ళే మెసేజీ మాత్రం చాలా దారుణంగా ఉంది అని చెప్పాలి. ఆ సంఘటన తో నేషనల్ మీడియా లో వల్గర్ స్టార్ గా బాలయ్య కి బ్యాడ్ నేమ్ ఒచ్చేసింది. మనవాళ్ళు కూడా బాలయ్య మీద కాస్త గుర్రు గానే ఉన్నారు.