News and Entertainment

భర్త స్నానం చెయ్యలేదని కేస్ పెట్టిన భార్య





మాములుగా మనం ఒక్కరోజు స్నానం చేయకపోతేనే ఏదోలా ఉంటుంది..అలాంటిది ఆ భర్త ఏడాదిలో కేవలం రెండు రోజులు మాత్రమే స్నానం చేస్తాడట. ఇతని వింత అలవాట్లను భరించలేక ఓ భార్య పోలీసులను ఆశ్రయించింది. ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగిందో మీరే చూడండి..



ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏడాది లో దీపావళి, హోలీపండుగ ఈ రెండు రోజుల్లోనే స్నానం చేస్తాడట. ఎవరు ఎంత చెప్పినా ఈ అలవాటు మార్చుకోకపోవడంతో విసిగిపోయిన భార్య భర్తమీద, అతని కుటుంబసభ్యుల మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


అతని ఇంట్లో వారందరూ ఇలాగే ప్రవర్తిస్తుంటారని, శుభ్రత అనేదే ఉండదని ఎంత చెప్పినా ‘మాకు తెలుసు.. నీ పని నువ్వు చూసుకుంటే మంచిది’ అంటూ తన నోరు మూయిస్తున్నారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఈ కేసును మహిళా పోలీస్‌స్టేషన్‌కి అప్పగించారు. ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరు ఇలాంటి వారు కూడా ఉంటారా అని ముక్కున వేలు వేసుకుంటున్నారు.