News and Entertainment

గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ పోస్టర్స్ అదిరిపోయాయి


బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్న చేస్తున్న వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్ విడుదల చేసారు. ఎగురుతున్న జెండా దానిపై గౌతమి పుత్ర శాతకర్ణి. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతున్న తరహాలో ఈ పోస్టర్ డిజైన్ ఉండటం విశేషం. ఆ పోస్టర్ ని మీరు క్రింద స్లైడ్ షోలో చూడవచ్చు. 



ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం(22-04-2016) ఉదయం 10.27 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కోరుతూ చిత్ర యూవుట్ విభిన్నమైన ఆహ్వానపత్రికను పంపిణీ చేసింది. స్వయంగా గౌతమి పుత్ర శాతకర్ణి ఆహ్వానిస్తున్నట్లుగా దీనిని ముద్రించారు. చిత్ర యూనిట్ పేర్లన్నిటికీ కూడా శాతకర్ణి పేరులాగా తల్లి పేరు చేర్చి ముద్రించిన ఈ ఆహ్వానపత్రిక ఆకట్టుకుంటోంది.



 ముహూర్తం శుక్రవారం ఉదయం గం.10.27ని.లకి. స్థలం అన్నపూర్ణా స్టూడియోలో. శ్రీబసవరామ తారకపుత్ర నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం అంజనాపుత్ర రాధాకృష్ణ(క్రిష్‌) దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గౌతమిపుత్ర శాతకర్ణి' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కి, చిత్రపరిశ్రమ ప్రముఖులకు, పాత్రికేయులు తదితరులకు ఈ ఆహ్వానపత్రిలు అందించారు. 



ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజీవ్‌రెడ్డి, శ్రీనివాస్‌, సాయిబాబులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ.... భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం క్రింద పరిపాలించిన మహా చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. తెలుగు వారందరూ తెలుసుకోవాల్సిన గొప్ప చరిత్ర ఇది. నాన్నగారు ఈ పాత్ర చేయాలని భావించి ఆరు నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశారని తెలిసింది. 



ఆయన చేయలేకపోయిన పాత్ర నన్ను వరించడం అదృష్టంగా భావిస్తున్నాను. గౌతమీపుత్ర శాతకర్ణి శాంతి కోసం యుద్ధాలు చేశారు. ఛత్రపతి శివాజీతో సహా అనేకమంది రాజులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. స్లైఢ్ షోలో ఫస్ట్ పోస్టర్ మరియు ఆహ్వానపత్రం, బాలయ్య లుక్ వంటివి చూడండి...                                               Next>>