News and Entertainment

శృంగారానికి ఒప్పుకోలేదని ఏకంగా 250మందిని అలా చేశారు!


క్రూర‌త్వం, అరాచ‌క‌త్వాల‌ను త‌న ఇంటిపేరుగా మార్చుకున్న ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ త‌న ఖాతాలో మ‌రో అరాచకాన్ని వేసుకుంది. త‌మ‌కు సెక్స్ బానిస‌లుగా త‌లొగ్గ‌డానికి ఇష్ట‌ప‌డ‌నందుకు 250 మంది బాలికలను అతికిరాతకంగా తలనరికి చంపింది. తమ అధీనంలో ఉన్న ఇరాక్‌లోని మోసుల్ పట్టణంలో జ‌రిగిన దారుణ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాదులు త‌మ గ్రూపు త‌ర‌పున ప‌ని చేస్తోన్న ఉగ్ర‌వాదుల‌ను తాత్కాలికంగా పెళ్లి చేసుకుని వారికి సెక్స్ బానిస‌లుగా ఉండాల‌ని 250 మంది బాలిక‌ల‌కు ఫ‌ర్మానా జారీ చేసింది.


ఐఎస్‌ఐఎస్ ఫ‌ర్మానాను ఆ అమ్మాయిలు ధిక్క‌రించ‌డంతో వారిని కుటుంబసభ్యుల సమక్షంలోనే తల నరికి చంపినట్టు కుర్దిష్ డెమొక్రటిక్ పార్టీ అధికార ప్రతినిధి సయెద్‌ మముజిని తెలిపారు. ఈ సెక్సువల్ జిహాద్‌ కోసం తమ బిడ్డలను అప్పగించేందుకు నిరాకరించిన తల్లిదండ్రులను కూడా ఐఎస్‌ ఉగ్రవాదులు ఇదేరకంగా హతమార్చారని ఆయన వెల్లడించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఐఎస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని… అమ్మాయిలు తమకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొనేందుకు ఏమాత్రం అనుమతి లేదని ఆయన చెప్పారు. గత ఏడాది ఆగస్టులో మోసుల్‌ పట్టణంలో ఐఎస్‌ ఫైటర్లతో శృంగారంలో పాల్గొనేందుకు నిరాకరించినందుకు 19 మంది అమ్మాయిల‌ను కూడా అతి కిరాతకంగా చంపేసిన సంగ‌తి తెలిసిందే.                                              Next>>