News and Entertainment

‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ లోగో రిలీజ్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చిరంజీవి 150వ సినిమాతో నిర్మాతగా మారుతున్న రామ్ చరణ్ 'కొణిదెల ప్రొడక్షన్స్' పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పాడు. 

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ లోగోను తాజాగా రామ్ చరణ్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా రిలీజ్ చేసాడు. హనుమాన్ బొమ్మతో ఉన్న ఈ లోగో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదే బేనర్లో చిరంజీవి 150వ సినిమా నిర్మాణం కాబోతోంది. 150వ సినిమా ప్రారంభ కార్యక్రమం ఈ రోజు(ఏప్రిల్ 29) మధ్యాహ్నం గం.1.30 ని.లకు జరగనుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న వివి వినాయక్ అంతర్వేదిలో లక్ష్మీనరసింహా స్వామి వద్ద చిరు 150వ సినిమా స్క్రిప్ట్‌ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:
షేకింగ్ బడ్జెట్ తో చరణ్, సుకుమార్ సినిమా  

loading...