News and Entertainment

సినిమాల్లో 'లక్' లేక బిచ్చమెత్తుకుంటున్న హీరోయిన్


సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఓ యువతి ఇప్పుడు బిచ్చం ఎత్తుకుంటుంది. సినిమా రంగంలో అవకాశం లభించడం ఒక ఎత్తైతే, విజయం సొంతం చేసుకోవడం, దానిని కొనసాగించడం మరో ఎత్తుగా చెప్పవచ్చు. ఇవి కావాలంటే అదృష్టం కావాలంటారు. ఆ 'లక్' అందకపోతే జీవితం ఎటు వెళ్తుందో తెలియదు. దానికి ఉదాహరణే ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మ. ఆమెకు సినిమాలంటే ప్రాణం. దీంతో ముంబైకి వచ్చి సినిమాల్లో నటించాలనుకుంది. అందుకోసం ప్రయత్నాలు కూడా చేసింది. చివరకు, ఒక భోజ్‌పురీ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది.

ReadMore: మీ చుట్టూ దెయ్యం తిరుగుతోందని సూచించే సంకేతాలివే 


అయితే, ఆ సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రం విజయం సాధించకపోవడంతో ఆమెకు హీరోయిన్‌గా నటించే అవకాశాలు రాలేదు. దీంతో, కుంగిపోయిన మిథాలీ శర్మ తిరిగి ఇంటికి కూడా వెళ్లలేకపోయింది. సినిమాల్లో నిలదొక్కుకోలేని తాను తన తల్లిదండ్రులకు ముఖం చూపించలేకపోయింది. వేరే పనుల వల్ల జీవనోపాధి పొందేందుకు కూడా ఆమె ఆసక్తి చూపించలేదు. సినిమా తప్ప తనకు వేరే పనేమి తెలియదనుకున్న మిథాలీ జీవనం ప్రస్తుతం దుర్భరంగా మారింది. ముంబైలోని లొకండ్ వాలా వీధుల్లో బిచ్చమెత్తుకుని బతుకుతోంది. 

ReadMore: సినిమా ల్లో యాక్ట్ చేసే అవకాశం మీకోసం? డోంట్ మిస్!   


మానసికంగా కూడా ఆమె పరిస్థితి సరిగ్గా లేదు. ఒష్విరా హౌసింగ్ సొసైటీలో ఆగి ఉన్న ఒక కారు అద్దాలను పగుల కొడుతుండగా ఆమెను పోలీసులు గుర్తించి, ఆసుపత్రికి తరలించారు. అక్కడ మిథాలీ శర్మ గురించిన విషయాలు పోలీసులకు తెలిసింది. హీరోయిన్ కావాలన్న తన కోరిక నెరవేర్చుకున్న మిథాలీ.. ఒకే ఒక్క ఫెయిల్యూర్ కారణంగా బిచ్చగత్తెగా మారింది.


loading...