News and Entertainment

మోహన్ బాబు గారికి టికెట్స్ దొరకట్లేదంట


' మోహన్ బాబు ' ఇండస్ట్రీ లోకి కష్టపడి ఎదిగిన హీరోలలో ఒకరు. ప్రస్తుత తరానికి వారధిగా నిలుస్తూ పాత తరం మెచ్చుకోలు ని కూడా సమానం గా అందుకుంటున్న హీరో ఆయన. అయితే మోహన్ బాబు కొన్ని విషయాలలో డబ్బా ఎక్కువగా కొట్టుకుంటారు అనీ ముఖ్యంగా తమ మంచు సినిమాల విషయం లో దీనికి అంతే ఉండదు అనీ అంటూ ఉంటారు .


తన పెద్ద కొడుకు ఈడొక రకం ఆడొక రకం సినిమా మొన్న గురువారం విడుదల అయిన సంగతి తెలిసిందే ఈ సినిమా టికెట్ల కోసం తానే ఇబ్బంది పడ్డాను అనీ ఆ సినిమా అంత పెద్ద సూపర్ హిట్ అయ్యింది అనీ అంటున్నారు "మోహన్ బాబు". 


క్లీన్ సూపర్ హిట్ అంటే ఇదేననీ తనంతట తాను సినిమా చూడాలి అనుకున్నా కూడా , జనం తో పాటు చూసి వారి స్పందన గమనిద్దాం అనుకున్నా కూడా టికెట్లు దొరకలేదు అంటున్నారు మోహన్ బాబు. నిర్మాత అనిల్ సుంకర ని కలిసి స్వయంగా అతని ద్వారా టికెట్ లు కోరగా నిర్మాత కి కూడా టికెట్టు దొరకలేదు అని మోహన్ బాబు చాలా హ్యాపీగా చెబుతున్నారు.



ఇలాంటి సోది చెప్పడం మోహన్ బాబు కి కొత్తేమీ కాదు. సొంత కొడుకు సినిమా కి మోహన్ బాబు గారికి టికెట్టు దొరకలేదు అనడమే కామీడీ అంటే ఏకంగా ప్రొడ్యూసర్ వలన కూడా టికెట్టు దక్కలేదు అనడం మరింత కామెడీ.