News and Entertainment

అఖిల్ కి NTR షాక్





అక్కినేని యంగ్ హీరో అఖిల్ రెండో చిత్రానికి వంశీ పైడిపల్లినే దర్శకుడిగా ఫిక్స్ చేశారనే టాక్ వినిపించింది. బాలీవుడ్ మూవీ ‘యే జవానీ హై దివానీ’ని తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్ణయించారని ఈ ప్రాజెక్టుతో అఖిల్ కి హిట్ ఇచ్చే బాధ్యతను వంశీకే నాగ్ అప్ప‌గించార‌ని నిన్న‌టి వ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి ఊపిరి సినిమా రిలీజ్‌కు ముందే ఈ వార్త‌లు వ‌చ్చినా ఊపిరి త‌ర్వాత వంశీపై నాగ్‌కు మ‌రింత న‌మ్మం కుదిరింద‌ని కూడా టాక్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.



అయితే ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ ఇండ‌స్ర్టీలో వినిపిస్తోంది. ఇప్పుడీ ప్రాజెక్టును టేకప్ చేసేందుకు వంశీ పైడిపల్లి సిద్దంగా లేడట‌. ఊపిరి రీమేక్ కావడం మళ్లీ రీమేక్ సినిమానే చేస్తే.. తనను రీమేక్ ల దర్శకుడిగా బ్రాండ్ వేస్తారనే ఆలోచనతోనే.. అఖిల్ సినిమాను వదులుకునే ఆలోచనలో ఉన్నాడట ఈ డైరెక్టర్. ఊపిరి రెండో వీకెండ్ నాటికే 35 కోట్ల షేర్ వసూళ్లను సాధించి.. సేఫ్ ప్రాజెక్ట్ దిశగా దూసుకుపోతోంది.




ఊపిరి మంచి హిట్ అయినా వంశీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఇంకా నోరు మెదపడం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం వంశీ ఎన్టీఆర్ తో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడట‌. జూనియర్ కి సరిపోయే స్టోరీ ఇప్పటికే ఈ దర్శకుడి దగ్గర సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాలతో జనతా గ్యారేజ్ చేస్తున్న యంగ్ టైగర్.. దీని తర్వాత హను రాఘవపూడితో కానీ పూరీ జగన్నాథ్ తో కానీ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మరి అవి పూర్తయ్యేవరకూ వంశీ ఆగుతాడో.. లేక అఖిల్ వైపే మొగ్గుతాడో ఇంకా తేలలేదు. వెయిట్ అండ్ సీ.