News and Entertainment

అభుమానులు, ఫామిలీలపై సెటైర్స్ వేసిన పవన్


ఈరోజు ప్రముఖ పత్రికలు ఛానల్స్  అన్నీ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ విశేషాలతో నిండి పోయాయి. ఎప్పుడూ మితంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ అనేక విషయాల పై తన మనసులోని అభిప్రాయాలన్ అత్యంత ఆసక్తి దాయకంగా వెల్లడించాడు. ఇదే సందర్భంలో పవన్ తనను విపరీతంగా ఆరాధించే అభిమానుల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు .

తాను గత 20 సంవత్సరాలలో కేవలం 20 సిమాలు మాత్రమే చేయడానికి గల అనేక కారణాలలో తన అభిమానులు కూడ ఒక కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.. తనకు చేతకాని విషయాలను తను చేస్తే ఆనందించాలని తన అభిమానులు పడే ఆరాటo తనకు టెన్షన్ పెంచేస్తోందని కామెంట్ చేసాడు. తాను ఒక ప్రభుదేవా లా డాన్స్ చేస్తే చూడాలని తన తన అభిమానులు కోరుకుంటారని అది తన వల్ల కాదు అని చెప్పినా వారికి ఉన్న విపరీతమైన అభిమానం మాయలో తాను అద్భుతాలు చేయాలని తన అభిమానులు కోరుకుంటారు అని కామెంట్స్ చేసాడు పవన్.


తాను చక్కగా నటించగల సన్నీ వేషాలు చేస్తే ప్రేక్షకు వాటిని చూడరని తనకు చేతకాని డాన్స్ లు చేస్తూ పవర్ ఫుల్ పంచ్ డైలాగులు చెపుతూ సినిమాలు చేసినప్పుడు మాత్రమే తన అభిమానులు ఆ సినిమాలను చూస్తారని తనకి చేతకాని విషయాలలో నటిస్తూ తాను వేరైతే ఎక్కడ చూపెట్టగలను అంటూ అభిమానుల పై సెటైర్లు వేడాడు పవన్. రొటీన్ సినిమాలు చేయడం వల్ల పరాజయాలు అర్హయని అయితే పరాజయాలు తట్టుకోలేక తన అభిమానులు టెన్షన్ పెడుతూ తనని టెన్షన్ పెడుతున్నారు అంటూ అభిమానులను టార్గెట్ చేసాడు పవన్.


ఇక తన పిల్లల గురించి మాట్లాడుతూ తన ఇల్లు నానా భాష సమితిలా మారిపోయిందని తన పెద్ద కూతురు ఆద్యా మరాఠీ లో మాట్లాడుతుందని తన చిన్న కూతురు పూర్తిగా వెస్ట్రన్ ఇంగ్లీష్ స్టైల్ లో మాట్లాడుతుందని ఇక తన కొడుకు అకిరా తెలుగు పుస్తకం చదువుతూ ఉంటే తెలుగు భాష అక్షరాలను మార్చి చదువుతున్న తన కొడుకు తెలివి తేటలు చూసి అదిరి పోతున్నాను అంటూ కామెంట్ చేసాడు పవన్. ఇవన్నీ చూస్తూ ఉంటే తన కోసం కాకుండా అభిమానుల కోసం సినిమాలు చేస్తూ తనకు అర్ధం కాని భాషలతో మాట్లాడుతున్న పిల్లలతో కాలం గడుపుతూ తనకు అర్ధం కాని జీఇతాన్ని ఎవరి కోసమో తాను బతుకుతున్నట్లు ఫీలింగ్ కలుగుతోందని తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు పవన్..