News and Entertainment

పవన్ తన మూడో వైఫ్ మీద షాకింగ్ కామెంట్స్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా గురించి ప‌బ్లిక్‌కు పెద్ద‌గా తెలిసింది చాలా త‌క్కువే. త‌న‌తో పాటు తీన్‌మార్ సినిమాలో న‌టించిన స‌హ‌న‌టి అన్నా లెజ్నెవాను ప‌వ‌న్ ప్రేమించి 2013లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ పాప కూడా పుట్టింది. తెలుగు అస్స‌లు తెలియ‌ని ఒక ఇంగ్లీష్ అమ్మాయితో పవన్ కాపురం ఎలా ఉంటుంది. అన్నా తెలుగు మాట్లాడుతుందా ? ఆమె ఇక్క‌డ వాతావ‌ర‌ణంలో సెట్ అయ్యిందా అన్న ప్ర‌శ్న‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రికి స‌మాధానాలు తెలియ‌వు.

అన్నా ఇటీవ‌లే చిరు చిన్న కుమార్తె శ్రీజ వివాహ వేడుక‌లో మొట్ట‌మెద‌టి సారిగా హ‌డావిడి చేసింది. ఇదిలా ఉంటే పై ప్ర‌శ్న‌ల‌కు స‌ర్దార్ ప్ర‌మోష‌న్‌లో ప‌వ‌న్ స‌మాధానాలిచ్చారు. త‌న మూడో భార్య అన్నా లెజ్నెవా స‌నాత‌న క్రైస్తవ మతస్తురాలని, అందుకే తనకు,నాకు పుట్టిన బిడ్డకు క్రైస్తవ ఆచారం ప్రకారమే పోలెనా అనే పేరు పెట్టామ‌ని, అలాగే పెంచుతున్నానని చెప్పారు.

అలాగే అన్నా వయొలిన్‌ ప్లేయర్‌ మరియు లింగ్విస్టిక్‌ ఎబిలిటీలో ట్రాన్స్‌లేటర్ అని తెలిపాడు. అలాగే త‌న కూతురు ఆద్య కోసం తాను ఇప్పుడిప్పుడే మ‌రాఠిలో మాట్లాడుతున్నాన‌ని… ఇక పొలెనా కోసం ఇంగ్లీషులో మాట్లాడ‌తాన‌ని చెప్పారు. ఇక త‌న భార్య అన్నా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటోంద‌ని కూడా ప‌వ‌న్ చెప్పాడు.