News and Entertainment

అనుష్క ఫ్రెండ్ తో ప్రభాస్ పెళ్ళి ఫిక్స్



తెలుగు లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ గా ఉన్న హీరో ప్రభాస్. అతని పెళ్లి విషయం లో మీడియా ఇప్పటి వరకూ ఎంత హడావిడి చెయ్యాలో అంతా చేసింది. బాహుబలి మొదటి భాగం తరవాత పెళ్లి చేసుకుంటా అంటూ అప్పట్లో చెప్పిన ప్రభాస్ తరవాత మాట మార్చాడు. కానీ మీడియా ఒదలకుండా ప్రభాస్ ని అదే ప్రశ్న తో వేధిస్తూనే ఉంది. 

ప్రభాస్ ఈమెనే చేసుకుంటున్నాడు అంటూ ఒక ఫోటో కూడా  ఇంటర్నెట్ లో హల్చల్ చేసింది. దాని మీద ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు అదంతా రూమర్ లు అంటూ సమాధానం కొదొఆ ఇచ్చారు. అయితే మనకి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభాస్ ఇప్పుడు నేహా ఆయినే అమ్మాయి ని పెళ్లి చేసుకో బోతున్నాడా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి .



బాహుబలి సెట్స్ లో అనుష్క ఫ్రెండ్ గా ప్రభాస్ కి పరిచయం అయిన ఆమె ప్రభాస్ కి దగ్గర అయ్యిందట. తన శలవుల సమయం లో బాహుబలి సెట్స్ కి ఒచ్చిన ఆమె ప్రభాస్ తో మొదట ఫ్రెండ్షిప్ చేసింది అని తరవాత ఇరు పక్షాల పెద్దలూ మాట్లాడుకునే ఛాన్స్ ఉంది  అనీ అంటున్నారు. సౌత్ ఆఫ్రికా లో ఒక కోటీశ్వరుడి కూతురుగా ఆమె గురించి చెబుతున్నారు. 

ప్రభాస్ ఫామిలీ ఈ విషయం గురించి తెలుసుకుని బాగా ఖుషీ అవుతున్నారు అనీ ప్రభాస్ ఆమెతో ప్రోపోజల్ పెడితే తాము ప్రొసీడ్ అవ్వడానికి వారు ఎదురు చూస్తున్నారు అంటున్నారు. అంతా సరిగ్గా కుదిరితే రెండు వారాలలో ఎంగేజ్మెంట్ ఉంటుంది అనీ జులై నెలాఖరున పెళ్లి ఉండచ్చు అంటున్నారు.