News and Entertainment

మన అమీర్ పేటలో ఘోరం


తాను తయారు చేసిన సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ విఫలమవటంతో తీవ్రమనస్థాపానికి గురైన ఓ హైదరబాద్ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లో చోటు చేసుకుంది. 


వివరాల్లోకి వెళితే... అమీర్‌పేట్‌లోని స్వర్ణ ప్లాజా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న 33 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లక్కీ గుప్తా అగర్వాల్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్రపంచంలోకి ఓ శక్తింతమైన అప్లికేషన్‌ను తీసుకురావాలనుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.


ప్రాజెక్ట్ ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టకపోగా, నష్టాలను మిగల్చటంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనైన అగర్వాల్ మంగళవారం రాత్రి నైట్రో గ్యాస్‌ను ఓ పాలిథిన్ కవర్‌లోకి ఎక్కించుకుని మెడ నిండా ఈ కవర్‌ను చుట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు అగర్వాల్ గదిలో ఓ సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. పెయిన్ లెస్ గా ఉంటుందని గ్యాస్ సిలిండర్ ద్వారా ఆత్మహత్య చేసుకుంటున్నానని అగర్వాల్ ఆ నోట్‌లో పేర్కొన్నారు.                                 Next>>