News and Entertainment

650 మందితో సెక్స్ చేశా


తాను ఏకంగా 500 నుంచి 650 మంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొనట్టు వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్ చెప్పి తన రసికతను ప్రకటించుకున్నాడు. క్రికెటర్‌గా కన్నా ఎక్కువగా అతను స్పోర్టింగ్‌ ప్లేబాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. 



త్వరలో విడుదల కాబోతున్న తన ఆత్మకథ'మైండ్‌ ద విండో్‌స'లో మహిళలతో తాను పెట్టుకున్న సంబంధాల గురించి రాశాడు. క్రికెటర్‌గా మైదానంలో ఆటలో కన్నా పడక గదిలో రాసక్రీడలతో తాను బద్దలు కొట్టిన రికార్డుల గురించి పుస్తకంలో రాసుకున్నాడు. తనకు అమ్మాయిలంటే పిచ్చి అని, తాను ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన బాల్డ్‌ హెడెడ్‌ గయ్‌ (బట్టతల)గా భావించేవాడినని చెప్పుకున్నాడు.