News and Entertainment

పవన్ మాటకి త్రివిక్రం సై


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ థియోటర్స్ లో రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ తరువాత చేయబోతున్న మూవీపై ఆసక్తి కరమైన చర్ఛలు జరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సర్ధార్ గబ్బర్ సింగ్ కమర్షియల్ సక్సెస్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత పవన్ కళ్యాణ్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.


ఒకటి త్రివిక్రమ్ కాంబినేషన్ ఫిల్మ్ అయితే, మరొకటి కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో. ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ముందుగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ 'అ ఆ' సినిమా తెరకెక్కించే విషయంలో బిజిగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత సూర్యతో ద్విభాషా చిత్రం చేయనున్నాడు. అయితే ప్రస్తుతం పనవ్ కళ్యాణ్, త్రివిక్రమ్ తో కాంబినేషన్ ని సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు కాబట్టి, తివిక్రమ్-సూర్య కాంబినేషన్ మూవీ పెట్టాలెక్కే ఛాన్స్ ఇక లేనట్టే అని అంటున్నారు.

ఒకవేళ ఉన్నప్పటికీ అది పవన్ కళ్యాణ్ మూవీ తరువాతనే ఉంటుందని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీపై వచ్చిన నెగిటివ్ టాక్స్ కి సరైన సమాధానం చెప్పాలంటే, తన తరువాతి మూవీ కచ్ఛితంగా సక్సెస్ ని సాధించాలి. కొత్త దర్శకులతోనూ, లైమ్ లైట్ లో ఉన్న దర్శకుడలతోనూ పని చేస్తే…తన మార్కెట్ కి నష్టం జరిగే ఛాన్స్ ఉంది.


ఇటువంటి సమయంలో కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ దర్శకులతోనే పనిచేయాల్సిన అవసరం, పవన్ కళ్యాణ్ కి ఎంతో ఉంది. పవన్ కళ్యాణ్ కూడ ఇదే విషయాన్ని కోరుకుంటున్నాడని అంటున్నారు. అందుకే వెరీ రీసెంట్ గా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కి కబురు పెట్టాడని తెలుస్తుంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రావటం ఖాయం అని అంటున్నారు.