News and Entertainment

టీం ఇండియాకి షాక్ ఇచ్చిన వర్మ
తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఈ మద్య సోషల్ నెట్ వర్క్ వేదికగా ఎన్నో సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తు వార్తల్లో నిలిచాడు. అయితే ఇప్పటి వరకు సినీ, రాజకీయాల గురించి కామెంట్ చేస్తూ వచ్చిన వర్మ తాజాగా టీమ్ ఇండియా పై కూడా సంచలనాత్మక వ్యాఖ్యలు చేశాడు. నిన్న ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మద్య జరిగిన మ్యాచ్ లో భారత్ చేతులారా మ్యాచ్ ని జారవిచుకుందనని కామెంట్ చేశాడు.ఇండియా భారీ స్కోర్ సాధించినప్పటికీ.. ఓటమిపాలయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అయితే భారత్ సాధించిన స్కోర్ రీచ్ కావడం అసాధ్యం అనుకున్నారు..అంతే కాదు స్టార్ బ్యాట్ మెన్ గెల్ అతి తక్కువ స్కోర్ కే ఔట్ కావడం పెద్ద ప్లస్ పాయింట్ అని అనుకున్నారు..కానీ భారత్ బౌలర్లు వేసిన బాల్లను బౌండరీలకు మలిపిస్తూ..వెస్ట్ ఇండీస్ బ్యాట్స్ మెన్స్ దుమ్ముదుళిపారు.


వెస్ట్ ఇండీస్ ల మధ్య జరిగిన మ్యాచ్ ను తాను బాగా ఎంజాయ్ చేశానని వర్మ చెప్తూనే.. వెస్ట్ ఇండీస్ క్రీడా మంత్రిత్వ శాఖను పొగిడాడు. వెస్ట్ ఇండీస్ క్రీడా మంత్రిత్వ శాఖను చూసి ఇండియా క్రీడా శాఖ నేర్చుకోవాలని.. వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. వెస్ట్ ఇండీస్ గెలుపును ఇండియా టీం కూడా సెలెబ్రేట్ చేసుకోవాలని వర్మ పేర్కొనడం విశేషం.