News and Entertainment

మహేష్ విజయ్ ల మల్టీస్టారర్ మూవీ




శ్రీమంతుడు చిత్రం తో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఇప్పుడు బ్రహ్మోత్సవం అంటూ మరో ఎంటర్టైనర్ తో మన ముందుకు రాబోతున్నారు. అయితే బ్రహ్మోత్సవం చిత్రం తర్వాత ప్రాజెక్టు కూడా ఖరారు అయిపోయింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓ మల్టి స్టారర్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురగదాస్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. దీనికి ఎనిమీగ అనే టైటిల్‌ నిర్ణయించినట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.


ఈ మేరకు మురుగదాస్ ఇప్పటికే మహేష్ బాబుతో స్క్రిప్ట్ ని కూడా ఫైనల్ చేసుకున్నాడు. ఇప్పటికే మురుగదాస్ విజయ్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే...విజయ్ కూడా మహేష్ బాబు కాంబినేషన్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమాలో విజయ్ పాత్ర కొద్ది నిముషాలకే పరిమితం అవుతుందని తెలుస్తోంది. అంటే దాదాపు ఓ 20 నిముషాల పాత్రలో విజయ్ నటించనున్నాడని సమాచారం. తెలుగు లో విజయ్ కు మార్కెట్ కావాలి..అందుకు మహేష్ ఉపయోగపడతాడు. అలాగే తమిళంలోనూ విజయ్ ద్వారా మహేష్ మరింతగా జనాల్లోకు దూసుకుపోవచ్చని ఈ మల్టిస్టారర్ స్ట్రాటజీతో వెళ్తున్నట్లు సమచారం.



మహేష్ బాబు, మురుగదాస్, విజయ్‌కి ఇప్పటికే మంచి మార్కెట్ వుంది. తద్వారా కోట్లాది కలెక్షన్స్ ఖాయమని సినీ జనం అంటున్నారు.బాలీవుడ్‌ తార శ్రద్ధాకపూర్‌ను ఈ చిత్రానికి హీరోగా ఎంపిక చేశారు. తెలుగు, తమిళంలో ఆమెకిదే తొలి చిత్రం. రూ.80కోట్ల భారీ వ్యయంతో తిరుపతి ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్‌.. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవంలో నటిస్తున్నారు. ఆ చిత్రం తరువాత ఏప్రిల్‌లో ఎనిమీ ప్రారంభం కానుంది. త్వరలోనే దీనిపై అధికార సమాచారం వెలువడనుంది.