News and Entertainment

అప్పుడు ఎన్.టి.ఆర్ ని, ఇప్పుడు పవన్ ని దెబ్బతీసింది ఎవరు?


మొన్న జూనియర్ ఎన్టీఆర్, నేడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లు రాజకీయ పంచ్‌ని చవి చూశారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఎలా ఉందనే విషయాన్ని పక్కన పెడితే.. పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేశారనే వాదనలు వినిపించాయి. 

అదే సమయంలో ఓ టాప్ హీరో కాబట్టి సినిమా ఎలా ఉందనే విషయమై చర్చ జరగడం సహజమేనని కూడా చెప్పవచ్చు. అయితే, పవన్ కళ్యాణ్ చిత్రానికి ఉద్దేశ్యపూర్వకంగా నెగిటివ్ టాక్ తీసుకు వచ్చారనే వాదనల నేపథ్యంలో గతంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ దమ్ము చిత్రం కూడా పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

2012 ఏప్ర్లిల్ నెలలో జూ ఎన్టీఆర్ దమ్ము చిత్రం విడుదలయింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ వారసత్వంపై జోరుగా చర్చ సాగుతోంది. ఓ వైపు చంద్రబాబు తనయుడు, మరోవైపు ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయలో జూనియర్ నటించిన దమ్ము చిత్రాన్ని చూడవద్దని ఉద్దేశ్యపూర్వకంగా సందేశాలు వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి.

వారసత్వ పోరు, ఆ సినిమా చూడవద్దని సందేశాలు వెళ్లిన ప్రభావం 'దమ్ము' చిత్రం పైన పడిందని ఆ తర్వాత