News and Entertainment

సెక్స్ కోసం.. 10కోట్లు తగలేశాడంట..!



పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి.. అంటారు.. ఒక్కొక్కరిదీ ఒక్కో వెర్రి.. కర్నాటకలోని  ఓ ప్రబుద్ధుడికి మద పిచ్చి.. ఎప్పుడు చూసిననా అమ్మాయిల గోలే. సెక్స్ సరదాల కోసం గంగవెర్రులెత్తిపోయేవాడు.. అవి తీరక తీవ్రంగా నిరుత్సాహపడే వాడు.. ఓ బ్యాంకులో పనిచేసే ఈ విజయసారధి అనే వ్యక్తి.. ఇలాగైతే లాభం లేదనుకుని తాను పని చేసే బ్యాంకు నుంచే ఏకంగా వంద కోట్ల రూపాయలు వివిధ మార్గాల్లో కొట్టేశాడు. 

అలా కొట్టేసిన సొమ్ముతో వివిధ ప్రాంతాల్లో భూములు, బినామీల పేరుతో ఆస్తులూ కూడగట్టుకున్నాడు. ఇక తనకు అత్యంత ఇష్టమైన సెక్స్ సరదాల కోసం ఏకంగా పది కోట్ల రూపాయలు వెచ్చించాడట. దేశవిదేశాలకు చెందిన యువతులతో సెక్స్‌ సరదాలు తీర్చుకున్నాడట. ముంబై, పూణే, ఢిల్లీలతో పాటు అరబ్‌ దేశాలు, యూరోపియన దేశాలలో కూడా తిరుగుతూ జల్సా చేశాడట.

వెళ్లిన ప్రతిచోటా 5, 7 స్టార్‌ హోటల్స్‌లో గడిపేవాడట. ఖరీదైన వేశ్యల కోసం ఒక్కో రాత్రికి రూ. ఐదు లక్షలు వరకూ ఖర్చు చేసేవాడట. ఒక్కోసారి హోటల్లో టిప్పే లక్ష రూపాయల ఇచ్చాడట. కానీ మోసం ఎన్నాళ్లో దాగదు కదా. బ్యాంకు స్కామ్ విచారణలో మనోడి సంగతి తెలిసిపోయింది. విచారణలో దొరికిపోయాడు. మొత్తానికి్ వంద కోట్ల కొట్టేసినట్టు రుజువైంది. 

అంత సొమ్ము రికవరీ చేద్దామని ప్రయత్నించిన పోలీసులకు ఈ వివరాలు తెలిసి ఆశ్చర్యపోయారట. విజయపురలో ఓ ఇంటితో పాటు బెంగళూరులోని జేపీనగర్‌లోను ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను, దక్షిణ కన్నడ జిల్లాలో ఆరెకరాల భూమిని విజయసారథి కొన్నాడట. పెళ్లి చేసుకుని భార్యను వదిలేసిన విజయసారథికి రేణుకాశెట్టి అనే గర్ల్‌ఫ్రెండ్‌ కూడా ఉండేదట. ఆమె పేరుతో ఆస్తులు కొన్నాడట. ఈ ఆస్తులంటే రికవరీ చేస్తారు కానీ.. అమ్మాయిల కోసం ఖర్చు చేసిన పది కోట్లు మాత్రం వెనక్కువచ్చే అవకాశమే లేదు.


ఇది కూడా చదవండి:
వాత్స్యాయన కామశాస్త్రం:స్త్రీలు సుఖాన్ని ఎలా పొందుతారు 
విస్కీ తాగడం వల్ల 10 మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్  


loading...