News and Entertainment

ప‌వ‌న్ కొడుకు అకీరాకు ప్రమాదం


ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – ఆయ‌న మాజీ భార్య రేణుదేశాయ్‌ల ముద్దుల త‌న‌యుడు అకీరా నంద‌న్‌కు గాయాల‌య్యాయి. గాయాలైన అకీరా ప్ర‌స్తుతం హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతున్నాడు. అకీరా సైకిల్ తొక్కుతూ ప్ర‌మాదానికి గుర‌వ్వ‌డంతో గాయాల‌య్యాయి. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ మాజీ భార్య రేణుదేశాయ్ త‌న ట్వీట్ట‌ర్ అక్కౌంట్ ద్వారా తెలిపారు. గాయాలైన అకీరా ప్ర‌స్తుతం ఓ ప్ర‌ముఖ హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతున్న‌ట్టు ఆమె తెలిపింది. అకీరాను డైలీ హాస్ప‌ట‌ల్‌కు తీసుకెళ్లి చూపిస్తున్నామ‌ని, ప్ర‌స్తుతం గాయాల తీవ్ర‌త కాస్త త‌గ్గిన‌ట్టు ఆమె తెలిపింది.

ఇక ప‌వ‌న్ నుంచి రేణు విడిపోయాక త‌న ఇద్ద‌రు పిల్ల‌లు అకీరా, ఆద్య‌తో క‌లిసి పూణేలో త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి నివాసం ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. అకీరాకు గాయాలైన‌ట్టు రేణు ట్వీట్ట‌ర్ ద్వారా తెలుసుకున్న ప‌వ‌న్ ఫ్యాన్స్ అకీరా వెంట‌నే కోలుకోవాల‌ని కోరుతూ త‌మ ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు.


ఇది కూడా చదవండి:

విమానంలో మనం విడిచిపెట్టే వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా?  

loading...