News and Entertainment

చెప్తాను బ్రదర్ :బనీ సూపర్ స్పీచ్-ఫాన్స్ కి క్లాస్


అల్లు అర్జున్ గత కొద్దిరోజులుగా పవన్ ఫ్యాన్స్ తో ఉన్న వివాదంతో ట్విట్టర్, ఫేస్ బుక్ లో ట్రెండింగ్ లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సరైనోడు విజయోత్సవంలో పవన్ గురించి మాట్లాడమని, పవన్ అభిమానులు ఓ వేడుకలో అల్లు అర్జున్‌ను కోరగా, ఆయన అందుకు సమాధానంగా 'చెప్పను బ్రదర్' అనడం సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది. 

పవన్ అభిమానులంతా బన్నీపై ఇదే విషయమై తీవ్ర అసహనం వ్యక్తం చేయగా, ఆయన మరోసారి ఇంటర్వూ లో కూడా 'చెప్పను బ్రదర్' అనడంతో పవన్ ఫ్యాన్స్ అసహనం,కోపం కొద్దిరోజులుగా తారాస్థాయికి చేరిపోయింది. దాంతో వారంతా చూసుకుందాం బ్రదర్ అంటూ హ్యాష్ ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో మళ్లీ నిరసన చేస్తున్నారు.

తాజాగా బన్ని...నాగబాబు కుమార్తె నిహారిక, నాగశౌర్య జంటగా నటించిన 'ఒక మనసు' ఆడియో ఫంక్షన్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు పవన్‌.. పవన్‌.. అంటూ కేకలు వేశారు. దీంతో ఆయన కాస్త అసహనానికి గురయ్యారు. ఈ విషయమై ఇక ముగింపు ఇవ్వటం బెస్ట్ అని భావించిన బన్ని, ఈ విషయమై మాట్లాడారు. 

బన్నీ ఈ సందర్భంగా పవన్ విషయమై మాట్లాడుతూ.. అసలు తాను ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో కారణం చాలా స్పష్టంగా చెప్పారు. ఇందుకు కారణం పవన్ ఫ్యాన్స్ అనటం అన్నారు. ఆయనేం మాట్లాడారో క్రింద స్లైడ్ షోలో చదవండి స్లైడ్ షోలో అసలేం జరిగింది, బన్ని ఏం మాట్లాడారు


loading...