News and Entertainment

15 సీన్స్ టెన్షన్ లో బ్రహ్మోత్సవం టేం



సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ బ్రహ్మోత్సవం మే 20న రిలీజ్ డేట్ అని చెప్పేశాడు. అయితే రిలీజ్ కు వారం మాత్రమే టైం ఉన్న ఈ సందర్భంలో సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనే చేస్తుండటం కాస్త కంగారుగా అనిపిస్తుంది అభిమానులకు. అంతేకాదు సినిమా ఫైనల్ అవుట్ పుట్ మీద సాటిస్ఫైడ్ గా లేదన్నది ఫ్రెష్ అప్డేట్.

అదీగాక సినిమాలో ఓ 15 సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయట. అయితే మహేష్ వాటిని కట్ చేయాల్సిదిగా కోరగా.. శ్రీకాంత్ అడ్డాల మాత్రం సినిమా కంటెంట్ మిస్ అవుతుంది అంటూ సర్ధి చెబుతున్నాడట. ఇక బ్రహ్మోత్సవం టీజర్ కూడా పూర్తి క్లాస్ సినిమాగా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ లో కాస్త నిరాశ మొదలైందని చెప్పాలి.

మరి అనుకున్నట్టుగా ఆ 15 సన్నివేశాలు కట్ చేసి రిలీజ్ చేస్తారా లేక దర్శకుడు మాట విని వాటిని అలానే ఉచుతారా అన్నది చూడాలి. మే 20న రిలీజ్ అని చెప్పి ఇప్పుడు ఇంకా సినిమా ఫైనల్ అవుట్ పుట్ రెడీ అవ్వకపోవడం మహేష్ కన్ ఫ్యూజన్ కు కారణాలుగా కనబడుతున్నాయి. మరి మహేష్ మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.

పివిపి బ్యానర్లో పరం వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది.

loading...